English | Telugu
ఎవరికి తెలియకుండా అర్థరాత్రి రాహుల్ ని కలిసిన స్వప్న!
Updated : Feb 23, 2023
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-27 లో.. రాహుల్ స్వప్న అర్థరాత్రి ఎవరికీ తెలియకుండా కలుసుకుంటారు. మరోవైపు స్వప్న ఫోన్ కి రాజ్ కాల్ చేయగా.. కావ్య ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. "నీకు ఈ పెళ్ళి ఇష్టమో లేదో నాకు తెలియదు. ఇష్టమైతే ఎస్ అని, లేదంటే నో అని చెప్పు చాలు" అని రాజ్ అనగా.. "ఎస్" అని కావ్య చెప్తుంది. థాంక్స్ స్వప్న అంటూ ఆనందంతో గంతులేస్తాడు రాజ్.
ఎవరికీ తెలియకుండా కలుసుకున్న స్వప్న, రాహుల్ మనసు విప్పి మాట్లాడుకుంటారు. ఇన్ని రోజులు నువ్వే చెప్తావని నేను ఆగాను.. ఇప్పుడు చెప్పు రాహుల్ అని స్వప్న అనగా.. "నా మనసు నిండా నువ్వే ఉన్నావ్.. మొట్టమొదటిసారిగా నిన్ను చూడగానే 'ఐ లవ్ యూ' చెప్పాలనుకున్నా.. ఇప్పుడు చెప్తున్నా ఐ లవ్ యూ స్వప్న" అని రాహుల్ అంటాడు. దానికి సమాధానంగా ఐ లవ్ యూ టూ రాహుల్ అని స్వప్న అంటుంది. మన ఇద్దరి పెళ్ళికి మన ఇంట్లో వాళ్ళెవరు ఒప్పుకోరు.. కాబట్టి మనం లేచిపోదాం. కొన్నిరోజులు బయటకెళ్ళి, మళ్ళీ తిరిగి వద్దాం.. ఆ తర్వాత వాళ్ళే ఒప్పుకుంటారని స్పప్న అంటుంది. నువ్వు ఎలాంటి నిర్ణయాలు తీసుకోకు.. నేను ఎలా చెప్తానో అలా చేయి చాలు అని రాహుల్ చెప్తాడు. ఆ తర్వాత స్వప్న అక్కడనుండి వాళ్ళింటికి వెళ్తుంది.
అలా స్వప్న ఇంటిలోపలికి సైలెంట్ గా వెళ్తుండగా కావ్య చూసి.. ఈ టైంలో ఎక్కడికి వెళ్ళొస్తున్నావ్ అక్కా అని అడుగుతుంది. నీకు చెప్పాల్సిన అవసరం లేదని స్వప్న చెప్పేసి వెళ్ళిపోతుంది. మరుసటి రోజు ఉదయం స్వప్న వాళ్ళ అమ్మ కోసం వెతుకుతుంది. ఎక్కడా కనపించదు. ఒక సేట్ దగ్గర కనకం వాళ్ళింటిని తాకట్టు పెట్టి పది లక్షలు తీసుకొని.. ఖరీదైన చీరలు స్వప్న కోసమని తీసుకొస్తుంది. అవి చూసిన కావ్య... "ఇన్ని డబ్బులు ఎక్కడివి" అని అడుగుతుంది. దాంతో కనకంకి ఏం చెప్పాలో అర్థం కాదు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకూ ఆగాల్సిందే.