English | Telugu

ఎమోషనల్ పోస్ట్ చేసిన బిగ్ బాస్ రన్నర్!


బిగ్ బాస్ ద్వారా చాలా మంది ఫేమస్ అయిన విషయం తెలిసిందే. ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేని చాలా మందిని బిగ్ బాస్ ఆడియన్స్ కు దగ్గర చేసింది. కొంతమందికి బిగ్ బాస్ తర్వాత సినిమా అవకాశాలు కూడా వచ్చాయి. బిగ్ బాస్ వల్ల పాపులారిటీ సొంతం చేసుకున్న వాళ్లలో సయ్యద్ సోహెల్ ఒకడు. బిగ్ బాస్ ద్వారా ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నాడు. ఈ గేమ్ షోలో తనదైన ఆటతో ప్రేక్షకులను ఆకట్టుకున్న సోహెల్.. ఇప్పుడు హీరోగా సినిమాలు చేస్తున్నాడు. గతంలో ఒకటి రెండు సినిమాల్లో నటించిన ఈ యంగ్ హీరో గతేడాది 'మిస్టర్ ప్రెగ్నెంట్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

సోహెల్ బిగ్ బాస్ తర్వాత వరుస సినిమా ఆఫర్లతో బిజీగా ఉన్నాడు. 2008 లో 'కొత్త బంగారు లోకం' మూవీలో గుర్తింపులేని పాత్రతో తన సినీ జీవితాన్ని ప్రారంభించాడు. 2013లో 'సంగీత మాయాజాలం' చిత్రంలో ప్రధాన పాత్రలో తన సినీ రంగ ప్రవేశం చేశాడు. 2020లో సోహెల్ స్టార్ మాటీవీ ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్-4లో ఎంట్రీ ఇచ్చాడు. ఆ సీజన్ రన్నరప్ నిలిచాడు. లక్కీ లక్ష్మణ్, ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు, మిస్టర్ ప్రెగ్నెంట్ వంటి సినిమాలలో సోహెల్ హీరోగా నటించాడు.

సోహెల్ కి ఇన్‌స్టాగ్రామ్ లో 945K ఫాలోవర్స్ ఉన్నారు. తను ఏ పోస్ట్ చేసిన మినిమమ్ లక్ష వ్యూస్ వస్తున్నాయి. అయితే తాజాగా సోహెల్ ఓ పోస్ట్ చేశాడు. అది ఎవరి గురించి చేశాడనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అసలు అందులో ఏం ఉందంటే.. " నిన్ను నువ్వు నమ్ముకో.. నీ జీవితాన్ని నీ కంట్రోల్ లో ఉంచుకో.. నిన్ను డిస్కరేజ్ చేసేవాళ్ళని పట్టించుకోకు.. నెగెటివ్ సోర్సెస్ ని, నెగెటివ్ మనుషులని, నెగెటివ్ థింగ్స్, నెగెటివ్ అలవాట్లని విడిచిపెట్టు.. డోంట్ గివప్.. డు నాట్ లూజ్ హోప్.. నీ కోసం అందమైన ప్రపంచం ఎదురు చూస్తుంది" అంటు సోహెల్ ఈ పోస్ట్ లో రాసుకొచ్చాడు. ఆయితే సోహెల్ ఫ్రెండ్స్ లిస్ట్ లో అఖిల్ సార్థక్ ఒకడు. వీరిద్దరి మధ్య గొడవ ఎప్పటినుండో సాగుతోంది. అయితే ఈ పోస్ట్ తనని ఉద్దేశించి రాసాడా లేక తన చుట్టూ ఉన్నవారిని ఉద్దేశించి రాసాడో తెలియాల్సి ఉంది. అయితే సోహెల్ చేసిన ఈ పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.