English | Telugu
ఇవ్వాళ నువ్వు నా చేతిలో ఐపోయావ్...ఆదికి రవితేజ మాస్ వార్నింగ్!
Updated : Dec 1, 2022
ఢీ-14 గ్రాండ్ ఫినాలే ప్రోమో మంచి కలర్ఫుల్ గా తయారై ఆడియన్స్ ముందుకు వచ్చేసింది. ఇక ఈ ప్రోమోలో రవితేజ మాస్ ఎంట్రీకి ఆడియన్స్, ఫాన్స్ కేకలు పెట్టారు. ఇక హైపర్ ఆది మాట్లాడుతూ "మీ గురించి చెప్పడానికి నాకు అదృష్టం ఉండాలి..మిమ్మల్ని కలిస్తే చాలు అనుకునే నేను...మీతో కలిసి ధమాకా మూవీలో చేసాను..ఇది నా అదృష్టం" అనేసరికి "నీతో చేయాలనీ నేనూ అనుకున్నాను.. ఎప్పటినుంచో...అది సరే కానీ ఆది..నీకు ఈ ప్రోగ్రాంకి అసలు సంబంధం ఏమిటి" అని మాస్ మహారాజ రవితేజ అడిగేసరికి అందరూ నవ్వేశారు.
"ఆది అసలు ఎవ్వరినీ వదిలిపెట్టడు..అందరినీ ఆడేసుకుంటాడు...ఇవ్వాళ నువ్వు నా చేతిలో ఇపోయావ్" అని అనేసరికి ఆది కూడా గట్టిగా నవ్వేసాడు. ఇక తర్వాత ఒక డాన్స్ కంటెస్టెంట్ తో కలిసి "ధమాకా" మూవీ నుంచి "నిన్ను చూడబుద్దాయితాంది రాజిగో" అనే సాంగ్ కి రవితేజ కూడా వచ్చి డాన్స్ వేశారు.
దాంతో హోస్ట్ ప్రదీప్ "మేం లైవ్ లో ఇలా చూడడం ఇదే మొట్టమొదటిసారి" అని అనేసరికి "లేదబ్బాయ్ నాకు కూడా ఊపొచ్చేసింది" అని కామెడీ చేశారు రవితేజ..