English | Telugu

వందల ఏళ్ళ నాటి చరిత్ర ఉన్న వస్తువులే ఆమె హోంటూర్ లో ప్రధాన ఆకర్షణ!

పేరుకు మాత్రమే సైడ్ క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌ తను. కానీ ఏ మూవీలో నటించినా చాలా హైలైట్ అవుతుంది. మిగతా క్యారెక్టర్స్ కంటే కూడా ఈమె నటించిన పాత్రే ఎక్కువగా గుర్తు ఉంటుంది. అలా త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపును సంపాదించుకున్న న‌టి ధ‌న్య బాల‌కృష్ణ‌. "సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు", "సాఫ్ట్‌వేర్ సుధీర్" లాంటి మూవీస్ తో తెలుగు ఆడియన్స్ ని ఆకట్టుకుంది ఈ ముందుగుమ్మ‌.

ఇప్పుడు ధన్య బాలకృష్ణ తన హోమ్ టూర్ వీడియో ఒకదాన్ని తన యూట్యూబ్ ఛానల్ లో పోస్ట్ చేసింది. ముందుగా లివింగ్ ఏరియాని చూపించింది. తనకు మీటింగ్స్ ఉన్నా వాళ్ళ నాన్న కోసం గెస్టులు వచ్చినా ఇక్కడే కూర్చుంటాం అని చెప్పింది. తన ఫామిలీ మొత్తం కూడా కూర్చుని మాట్లాడుకునే మంచి హ్యాంగౌట్ ప్లేస్ కూడా ఇదే అంది. అలాగే వాళ్ళ నాన్న మ్యూజిక్ రూమ్ ని కూడా చూపించింది. ఆయన ఒక వీణ ప్లేయర్. కాబట్టి ఆయన ఉదయం పూట, సాయంత్రం పూట క్లాసెస్ ఇక్కడే తీసుకుంటారట. ఆయన కూడా ఇక్కడే వీణ ప్రాక్టీస్ చేస్తారు అని చెప్పింది. అలాగే 100 ఏళ్ళ చరిత్ర ఉన్న వీణని కూడా చూపించింది ధన్య. ఇక ఇంట్లో ఉన్న తమ ఓపెన్ కిచెన్ ని చూపించింది. నానమ్మలా నేను వంట చేస్తాను. అందుకే మా నాన్నకు నా వంట చాల ఇష్టం అని చెప్పింది. అలాగే తన తాతయ్యకు 1983 లో వచ్చిన పద్మభూషణ్ అవార్డుని కూడా చూపించింది.

ఇక తన ఇంట్లో ఎవరికీ చెట్లను నరకడం ఇష్టం ఉండదు కాబట్టి తమ ఇంట్లోంచి బయటికి ఎదిగిన ఒక కొబ్బరిచెట్టుని తొలగించకుండా ఇల్లు కట్టుకున్నాం అని చెప్పింది. అలాగే బయట ఉన్న బావిని కూడా చూపించింది. ఇక వాళ్ళ నానమ్మ గదిని, అక్కడ ఉన్న పాత రేడియో, చెక్క ఉయ్యాల ఇలా తన ఇంట్లో 100 , 150 ఏళ్ళ క్రితం నాటి యాంటిక్ వస్తువులన్నిటిని చూపించింది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.