English | Telugu
నవ్య స్వామి పోస్ట్.. వైరల్ అయిన రవికృష్ణ రెస్పాన్స్!
Updated : Sep 12, 2022
నవ్యస్వామికి బుల్లితెరపై మంచి క్రేజ్ ఉంది. చాలా ఏళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉంది. సీరియల్స్ చేస్తూ ఆడియన్స్ ని అలరిస్తోంది. "నా పేరు మీనాక్షి", "ఆహ్వానం" వంటి సీరియల్స్‌తో నవ్య ఫుల్ ఫేమస్ అయింది. అయితే "ఆమె కథ" సీరియల్ మాత్రం నవ్య కెరీర్‌ను టర్న్ చేసింది. పెద్ద రేటింగ్ రాకపోయినా ఈమెకు మాత్రం ప్లస్ అయ్యింది ఆ సీరియల్. ఆ సీరియల్ లో హీరో రవికృష్ణ . ఇందులో వీళ్ళ జోడీకి ఫుల్ మార్క్స్ పడ్డాయి. ఇద్దరూ ఎక్కడికంటే అక్కడికి జంట పక్షుల్లా ఎగురుతూనే ఉంటారు. వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటారని కథనాలు కూడా వచ్చాయి. నవ్యస్వామి ఆ వ్యాఖ్యల్ని సున్నితంగా ఖండించింది. తామిద్దరం మంచి ఫ్రెండ్స్ అని , పెళ్లి వార్తలన్నీ రూమర్స్ అని చెప్పింది.
వేరే షోస్ లో, ఈవెంట్స్ లో వీళ్ళు చేసే హడావిడి మాములుగా ఉండదు. ఢీ షోలో ఈ ఇద్దరూ చేసిన హంగామా గురించి చెప్పక్కర్లేదు కానీ ఈ మధ్య వస్తున్న ఎపిసోడ్స్ లో మాత్రం ఈ జంట అసలు కనిపించడమే మానేసింది. ఐతే ఇప్పుడు నవ్యస్వామి వెకేషన్స్‌లో ఫుల్ ఎంజాయ్ చేస్తున్నట్టు కనిపిస్తోంది. గత నెలలో హరితేజతో కలిసి ఫారిన్ కంట్రీస్‌లో సందడి చేసిన నవ్య ఇప్పుడు మళ్ళీ తాజాగా నెథర్లాండ్స్ , ఆంస్టర్ డాం వంటి ప్లేసెస్ కి వెళ్లినట్టు తెలుస్తోంది.
తాజాగా ట్రైన్‌లో కూర్చుని అద్దంలోంచి చూస్తూ ఉన్న ఫోటో ఒకటి తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది. "గులాబీ రంగుల అద్దంలోంచి కనిపిస్తున్న ఈ జీవితానికి ధన్యవాదాలు" అనే టాగ్ లైన్ పెట్టింది. ఇక రవికృష్ణ కూడా దీనికి ఆన్సర్ గా మూడు రెడ్ హార్ట్ సింబల్స్ పోస్ట్ చేసాడు.అది వైరల్‌గా మారింది.