English | Telugu
బిగ్ బాస్ టైటిల్ విన్నర్ అతనే.. రతిక సంచలన కామెంట్స్!
Updated : Dec 11, 2023
బిగ్ బాస్ సీజన్-7 లో ప్రతీవారం ఒక ఎలిమినేషన్ ఉంటుంది. ఇప్పటికి పద్నాలుగు వారాలు ముగిసాయి. అయితే ఇందులో
రతిక రోజ్ మాత్రమే రెండుసార్లు హౌస్ లోకి వెళ్ళి రెండుసార్లు ఎలిమినేట్ అయి బయటకొచ్చింది. అయితే ఈ రెండుసార్లు కూడా పల్లవి ప్రశాంత్ ఎఫెక్ట్‌తోనే ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసిందనేది వాస్తవం. అయితే తాజాగా రతిక ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో పల్లవి ప్రశాంత్ ఆట గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది.
‘నాకు ఫేమ్ లేకుండానే బిగ్ బాస్‌కి వెళ్లాను. బిగ్ బాస్ ఆట ఎలా ఆడాలని తెలుసుకునే లోపే నా సెకండాఫ్ జర్నీ కూడా అయిపోయింది. వైల్డ్ కార్డ్ ఎంట్రీలతో వెళ్లిన వాళ్లు.. బయట జరిగింది మొత్తం పూస గుచ్చినట్టు హౌస్‌లో ఉన్న వాళ్లకి చెప్పేశారు. వాళ్లని కంట్రోల్ చేయాల్సింది. కానీ అలా చేయకపోవడం వల్ల బయట జరిగిన విషయాలతో నన్ను ట్రిగ్గర్ చేసి మాట్లాడేవారు. బయట చాలా ఇబ్బందుల్ని తట్టుకుని రెండోసారి హౌస్‌లోకి వెళ్లాను. కానీ అక్కడ కూడా నన్ను పొడుస్తున్నట్టుగానే మాట్లాడేవాళ్లు. నా ప్రయత్నం నేను చేశాను.. కానీ హద్దులు దాటేయడంతో నేను తట్టుకోలేకపోయాను. ఫస్ట్ టైమ్ వెళ్లినప్పుడు ఎలా ఆడాలో తెలియలేదు. కానీ రెండోసారి వెళ్లినప్పుడు ఏం మాట్లాడితే ఏమౌతుందనే భయంతో ఆడాను. నాకు భయం అంటే ఏంటో తెలియదు. కానీ ఆడియన్స్ నన్ను ట్రోల్స్ చేస్తారేమో అనే భయం చాలా ఉంది. దాంతో నేను నాలాగా ఉండలేకపోయాను. ఎందుకంటే లోపల నేను ప్రశాంత్ మాట్లాడిన మాటలతో నన్ను ఆడియన్స్ వేరేలే చూశారు. అది నన్ను బాధపెట్టింది. సోషల్ మీడియాని పట్టించుకోకుండా వెళ్లాల్సింది. నేను రెండోసారి వెళ్తున్నాననే విషయం ముందే రివీల్ చేయడంతో.. నువ్వు వెళ్తున్నావ్ కానీ వారంలోని లాక్కొస్తామనే నా ఇన్ స్ట్రాగ్రామ్ పోస్ట్ ల కింద కామెంట్లు పెట్టేవారు. దీంతో ఫస్ట్ టైమ్ ఉన్నంత ఫైర్ రెండోసారి వెళ్లినప్పుడు లేదు. అందుకే జనాలు నన్ను బయటకు తీసుకొచ్చేశారు.
ఇక ప్రశాంత్ గురించి చెప్పాలంటే.. అతనికి నేను చెప్పే విధానం సరిగా లేకపోవడం వల్ల నేను బ్యాడ్ అయ్యాను. నువ్వు నా పైన కాకుండా గేమ్‌పై కూడా ఫోకస్ పెట్టి ఆడు అని స్వీట్‌గా చెప్పి ఉంటే బాగుండేది. " సోఫాపై పేర్లు రాయడం, కిస్ లు అవి కాదు ప్రశాంత్.. ఇంత కష్టపడి వచ్చావ్ కదా, ఇవన్నీ వదిలేసి గేమ్‌పై ఫోకస్ పెట్టి బాగా ఆడు అని కూల్ గా చెప్పి ఉంటే అది క్యూట్‌గా ఉండేది. అదొక స్టోరీ అయ్యేది. కానీ వేరేలా చెప్పడం అది వేరేలా జనంలోకి వెళ్లడంతో నేను బ్యాడ్ అయ్యాను" అని రతిక చెప్పుకొచ్చింది. ప్రశాంత్‌కి ఎక్కడో మచ్చ ఉంది. అదృష్టం ఉంది. నేను బయటకు వచ్చేసిన తర్వాత ప్రశాంత్ ఆట బాగా ఇంప్రూవ్ అయ్యింది. బాగా ఆడుతున్నాడు. అతడు విన్నర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని రతిక తన మనసులో మాట చెప్పుకొచ్చింది.