English | Telugu
రీఎంట్రీ ఇచ్చిన రతిక.. వెళ్ళగానే శివాజీ కాళ్ళమీద పడ్డదిగా!
Updated : Oct 23, 2023
బిగ్ బాస్ సీజన్-7 లో ట్విస్ట్ లు మాములుగా లేవు కదా. ఒకరు ఎలిమినేషన్ అవుతుంటే, మరొకరు సీక్రెట్ రూమ్ కి వెళ్తున్నారు. ఇక బయటకు వెళ్లిన ముగ్గురిలో నుండి ఒకరు మళ్ళీ హౌస్ లోకి రావడం. ఇదంతా చూస్తున్న ప్రేక్షకులు ఇవెక్కడి ట్విస్ట్ లు రా మామా అని అనుకుంటున్నారు.
గతవారం శుభశ్రీ, దామిణి, రతికరోజ్ ముగ్గురు హౌస్ లోకి వచ్చి తమకి ఓట్ వేసి గెలిపించాలని హౌస్ మేట్స్ ని రిక్వెస్ట్ చేసి వెళ్ళిపోయారు. అయితే హౌస్ మేట్స్ అందరు కలిసి ఎవరు వస్తే బాగుంటుంది అనుకున్నారో వారికే ఓట్లు వేసారు. అయితే మెజారిటీ ఓట్లు వచ్చినవాళ్ళు కాకుండా లీస్ట్ ఓట్లు వచ్చినవారే హౌస్ లోకి రీఎంట్రీ ఇస్తారంటూ, ఇదే ఉల్టా పల్టా అంటూ మరో ట్విస్ట్ ఇచ్చాడు నాగార్జున. దీంతో హౌస్ మేట్స్ వేసిన ఓటింగ్ లో లీస్ట్ లో రతికరోజ్ ఉంది. దాంతో దసరా కానుకగా బిగ్ బాస్ హౌస్ లో గ్రాంఢ్ గా ఎంట్రీ ఇచ్చింది రతికరోజ్. స్టేజ్ మీదకి రాగానే.. మళ్లీ ఈ స్టేజ్ మీదకి వస్తానని అనుకోలేదంటూ, నాకు ఇది గోల్డెన్ ఛాన్స్ అంటూ నాగార్జునతో తన సంతోషాన్ని పంచుకుంది. లైఫ్ లో ఇలా సెకండ్ ఛాన్స్ ఎప్పుడు రాదు. నీకు వచ్చింది. మొదటి రెండు వారాలు నీ ఆట టాప్ లో ఉంది. ఆ తర్వాత పాతాళానికి పడిపోయింది. అందుకే ఎలిమినేట్ చేసి పంపించేశారు. ఇప్పుడు మళ్లీ ఈ తప్పు చేయకని నాగార్జున చెప్పాడు. ఈసారి పాతాళం నుండి టాప్ కి వెళ్ళిపోతా, నన్ను నేనేంటో ప్రూవ్ చేసుకుంటానని రతిక ప్రామిస్ చేసింది. ఇక డోర్ ఓపెన్ అవ్వగానే శివాజీ ఎదురుగా కనిపించాడు. నా టైమ్ బాగుంది శివన్నే కన్పించాడంటూ రతిక అంది.
వచ్చీ రాగానే శివాజీని హగ్ చేసుకుంది. అందరికి హాయ్ చెప్పిన రతికకి ఎదురుగా వచ్చి మరీ టేస్టీ తేజ అన్నం తినిపించాడు. ఆ తర్వాత సీరియల్ బ్యాచ్ లోని అమర్ దీప్, ప్రియాంక జైన్, శోభాశెట్టిలను పలకరించింది. ఇక అందరితో మాట్లాడిన తర్వాత శివాజీతో మాట్లాడాలని చెప్పి డీలక్స్ రూమ్ కి తీసుకెళ్ళింది. వెళ్ళగానే శివాజీ కాళ్ళమీద పడి.. నన్ను నీ బిడ్డ అనుకో అన్న, క్షమించు అన్న అని రతికరోజ్ అంది. "ఇక్కడికి గేమ్ ఆడటానికి వచ్చాం. ఇగోలు, గొడవలు వద్దు. గేమ్ మీద ఫోకస్ చేయు. ఇలా కాళ్ళమీద పడటాలు అవీ వద్దు" అని రతికతో శివాజీ అన్నాడు. ఆ తర్వాత కాసేపటికి కిచెన్ ఏరియాలో ఉన్న రతిక కోసం రసగుల్ల తీసుకొచ్చాడు పల్లవి ప్రశాంత్. "ఏంటి రసగుల్లనా.. మల్లొచ్చిన" అంటూ ప్రశాంత్ డైలాగ్ చెప్పి హ్యాపీగా తినేసింది రతిక.