English | Telugu
పల్లవి ప్రశాంత్ తో పెళ్ళికి రెడీ అంటున్న రతిక!
Updated : Dec 22, 2023
బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో ఎన్నో ఊహించని ట్విస్ట్ లతో ఉల్టా పుల్టా థీమ్ తో ఫుల్ క్రేజ్ తెచ్చుకుందనేది అందరికి తెలిసిందే. సీరియల్ బ్యాచ్ గ్రూపిజం ఓ వైపు, ఇండివిడ్యువల్ గా ఆడే కంటెస్టెంట్స్ , స్పై బ్యాచ్ మరోవైపు.. ఇలా అందరు తమ ఆటతీరుని వినూత్నంగా మలుచుకున్నవారే.
ఈ సీజన్ మొదట్లోనే రతిక, పల్లవి ప్రశాంత్ ల మధ్య లవ్ ట్రాక్ మొదలైంది. ఒక ఫ్రెండ్ షిప్ బ్యాండ్ రతికకి పల్లవి ప్రశాంత్ ఇవ్వడంతో మొదలైన ఈ బంధం అంచెలంచెలుగా ఎదిగింది. ఇద్దరు ఒకరికొకరు మాటలు ఎక్సేంజ్ చేసుకోవడం రాత్రి ఇద్దరే కబుర్లు చెప్పుకోవడం, సోఫా మీద పీ, ఆర్ అంటూ అక్షరాలు రాసుకోవడం ఇలా సాగుతుంటే మన బిగ్ బాస్ మామ వీళ్ళ లవ్ ట్రాక్ ని ప్రేక్షకులకి మరింత కనెక్ట్ అయ్యేలా మంచి లవ్ సాంగ్ తో తీర్చిదిద్దారు. అలా వీరిమధ్య లవ్ ట్రాక్ ఈ సీజన్ మొదట్లోనే బాగా క్రేజ్ తెచ్చుకుంది. ఆ తర్వాత నామినేషన్ లో పల్లవి ప్రశాంత్ పై అందరు కలిసి ఎదురిదాడికి దిగారు. ఇందులో బిగ్ బాస్ హౌస్ లోకి రావడానికి కుక్క లెక్క తిరిగినా అని ప్రశాంత్ అనగా.. మరి ఇప్పుడు లోపలకి వచ్చాక ఏం చేశావంటూ రతిక అనడంతో ప్రశాంత్ కి నోట మాట రాకపోయింది. ఆ తర్వాత ఇక రతికతో ప్రశాంత్ దూరంగా ఉండటం మొదలెట్టాడు. ఇక ఒకరోజు టాస్క్ లో ప్రశాంత్ ని రెచ్చగొట్టేలా మాట్లాడింది. నీకు సిగ్గులేదు, బుధ్ది లేదు, మీ అమ్మనాన్నలకి ఇదేనా నువ్వు చేసేది అంటూ రెచ్చిపోయి మాట్లాడింది. ఇక ఒక గొడవలో నువ్వు నాకేమైన చుట్టానివా, నేను తమ్ముడు అని పిలుస్తానని రతిక అనడంతో అప్పటి నుండి అక్క అని పిలవడం స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత హౌస్ నుండి ఎలిమినేషన్ అయి బయటకొచ్చాక ప్రశాంత్ ఫ్యాన్ ఫాలోయింగ్ చూసి ఫిధా అయినట్టుంది రతిక. ఆ తర్వాత మళ్ళీ రీఎంట్రీ ఇచ్చాక ప్రశాంత్ చుట్టూ తిరుగుతూ అక్క అని అనొద్దంటు శివాజీ చేత చెప్పించి పల్లవి ప్రశాంత్ ని రతిక అనేలా చేసుకుంది.
ఆ తర్వాత రతిక తన ఆటతీరుతో ప్రేక్షకులని డిస్సాపాయింట్ చేసింది అందుకే తొందరగా బయటకు వచ్చేసింది. బయటకొచ్చాక పల్లవి ప్రశాంత్ గురించి మీరేమనుకుంటున్నారని ఒక ప్రశ్న వేయగా.. అతను నాకు మంచి ఫ్రెండ్. అతడికి నా సపోర్ట్ ఎప్పుడు ఉంటుందని రతిక అంది. పల్లవి ప్రశాంత్ ఈ సీజన్ టైటిల్ గెలిచాక బిగ్ బాస్ బజ్ ఇంటర్వూ లో మరి ఆ అమ్మాయికి ఏం చెప్తావని అడుగగా.. మా అమ్మనాన్న ఎవరిని చేసుకోమంటే వారినే చేసుకుంటానని ప్రశాంత్ చెప్పాడు. అయితే హౌస్ లో రతిక, ప్రశాంత్ ల మధ్య సాగిన లవ్ స్టోరీ ఈ సీజన్ లో బాగా పాపులరైంది.