English | Telugu

పల్లవి ప్రశాంత్ అరెస్ట్‌పై శివాజీ షాకింగ్ కామెంట్స్!


బిగ్ బాస్ సీజన్‌ -7 లో శివాజీ, ప్రశాంత్, యావర్ లని కలిసి గురుశిష్యులనే అంటారు. ముఖ్యంగా ప్రశాంత్, శివాజీల మధ్య బాండింగ్ అలాగే ఉంటుంది. శివాజీ ఓ మాట చెప్తే.. ఎందుకన్నా అని తిరిగి మాట్లాడకుండా చేసేవాడు ప్రశాంత్.. అంతలా బాండింగ్ ఉండటం వల్లే శివాజీ, ప్రశాంత్ లని గురుశిష్యులని బయట అందరు పిలిచేవారు. హౌస్ లోకి కామన్ మ్యాన్ గా అడుగుపెట్టిన రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ శివాజీ సపోర్ట్ తో విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే ఆ విజయాన్ని రెండు రోజులు కూడా ఆనందించకముందే అతనిపై పోలీసు కేసు నమోదవ్వడం, పోలీసులు గాలించి మరీ అతడిని అరెస్ట్ చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. అయితే అతడిని రెండు వారాల పాటు రిమాండ్ లో ఉండాలని న్యాయస్థానం ఆదేశించింది. ‌ప్రస్తుతం చంఛల్ గూడ జైలులో ఉన్న ప్రశాంత్ కి సోషల్ మీడియాలో ఫ్యాన్స్ పెద్ద ఎత్తున తమ సపోర్ట్ ని తెలియజేస్తున్నారు.

పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ గ్రాంఢ్ ఫినాలే రోజున వాహానాలు ధ్వంసం చేసినందుకు గాను, ట్రాఫిక్ వాయిలెన్స్ ని క్రియేట్ చేసినందుకు గాను కొందరిపై‌ జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ కూడా చేసినట్టు తెలిసింది. అయితే ఇందులోని ప్రధాన నిందితులని తాజాగా పోలీసులు అరెస్ట్ చేశారు. మొన్న పల్లవి ప్రశాంత్, రాజుని చంచల్ గూడ జైలుకి తరలించిన పోలీసులు.. నిన్న రాత్రి మిగతా దుండగులని పోలీసులు అరెస్ట్ చేసినట్టు మీడియాకి తెలియజేశారు. అయితే ఫ్యాన్స్ చేసిన తప్పు వల్ల రైతుబిడ్డ జైలుకెళ్ళాడు. కామన్ మ్యాన్ గా వెళ్ళి టాస్క్ లలో ఎంతో కష్టపడి కాళ్ళు, చేతులు విరగ్గొటుకొని చివరికి టైటిల్ గెలిచి బయటకొస్తే ఆ విజయాన్ని రెండు రోజులు కూడా ఆస్వాదించకముందే ఇలా అవ్వడం చాలా బాధాకారమని పలువురు బిబి కంటెస్టెంట్స్ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

భోలే షావలి ఏడుస్తూ తనని వదిలిపెట్టమని రిక్వెస్ట్ చేయగా, అశ్వినిశ్రీ తన మద్దతు తెలిపింది. ఇక ఆటసందీప్ భార్య జ్యోతి సైతం తన ఇన్ స్టాగ్రామ్ లో పల్లవి ప్రశాంత్ ని సపోర్ట్ చేయండి అని పోస్ట్ చేసింది. అయితే ఇప్పుడు తాజాగా శివాజీ తన సపోర్ట్ ఉందని ఇన్ స్టాగ్రామ్ ద్వారా తెలియజేసాడు. " యావర్, ప్రశాంత్ ఇద్దరు నాకు బిడ్డల్లాంటి వారు. గత రెండు రోజులుగా ప్రశాంత్ మీద వస్తున్న వార్తలని, ఇష్యూలని అన్నింటిని చూస్తున్నాను. వాడి(పల్లవి ప్రశాంత్) తో, వాళ్ళ నాన్నతో ఎప్పుడు టచ్ లోనే ఉన్నాను. అయిన నేను ప్రతీది ఫ్రూవ్ చేసుకోనవసరం లేదు. ఎందుకంటే వాడేంటో నాకు తెలుసు. నేనేంటో వాడికి తెలుసు. వాడు చేయని తప్పుకి లోపలికి వెళ్ళాడు. ప్రశాంత్ చట్టాన్ని గౌరవించే వ్యక్తి, అందుకే లోపలికి వెళ్ళాడు. ఈరోజు కాకపోతే రేపు బయటకు వస్తాడు. వాడికెప్పుడు నా సపోర్ట్ ఉంటుంది. ఎవరు భయపడాల్సిన పనిలేదు. భాదపడాల్సిన అవసరం లేదు. అంతా కంట్రోల్ లోనే ఉంది " అంటు శివాజీ ఈ వీడియోలో చెప్పుకొచ్చాడు. ఈ వీడియోకి స్పై బ్యాచ్ అభిమానులు.. మా సపోర్ట్ అంటు తమ అభిప్రాయాలు తెలుపుతున్నారు. కాగా ఇది ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్ లో ఉంది.