English | Telugu
రియల్ లైఫ్ స్టోరీ స్కిట్.. కన్నీటిపర్యంతమైన రష్మీ గౌతమ్!
Updated : Jul 21, 2022
శ్రీదేవి డ్రామా కంపెనీలో "అక్కా బావెక్కడ" పేరుతో లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో ఇప్పుడు రిలీజ్ అయ్యింది. ఇందులో రష్మీ తప్పుల తడకతో తెలుగు మాట్లాడుతూ ఉంటే దాన్ని హైపర్ ఆది సరిచేస్తూ ఉంటాడు. అప్పుడు రష్మీ లవ్ ఫెయిల్యూర్ ఐనట్టుగా "ఒక 90 కొడదామని వైన్ షాప్ కి బయల్దేరా. కానీ అక్కడకి వెళ్లి చూస్తే బోర్డు మీద 18 ఇయర్స్ నిండిన వాళ్ళకే అని రాసి ఉంది. వెంటనే ఇంటికి తిరిగి వచ్చేసా." అని రష్మీ చెప్పేసరికి "అప్పటికే ఒక 90 వేసావ్ నువ్వు." అన్నాడు ఆది.
తర్వాత రోహిణి మందేసి "తకిట తధిమి" సాంగ్ కి కమల్ హాసన్ టైపులో డాన్స్ చేసి అలరించింది. తర్వాత రష్మీ బయోగ్రఫీ పేరుతో తన లైఫ్ లో పడిన కష్టాలని ఒక స్కిట్ గా చేసి చూపించారు కమెడియన్స్. రియల్ లైఫ్ లో రష్మీ వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరూ విడిపోయారు. రష్మీ మాత్రం వాళ్ళ అమ్మ దగ్గరే ఉండిపోయింది. రష్మీ పెద్దదయ్యాక తనకు మూవీస్ లో ఆఫర్స్ వచ్చాయి. ఆ విషయాన్ని వాళ్ళ అమ్మకు చెప్పి ఇండస్ట్రీ వైపు వెళ్తానని అడిగింది.
"మంచేదో, చెడేదో నీకు తెలుసు కదా.. నేను నీకు చెప్పాల్సిన అవసరం లేదు" అని వాళ్ళ అమ్మ ప్రోత్సహించి పంపించింది. ఆ తర్వాత రష్మీ యాక్ట్ చేసిన మూవీస్ నుంచి కొన్ని బిట్స్ ప్లే అయ్యాయి. షూటింగ్ ముగించుకుని ఇంటికి తిరిగి వెళ్లింది రష్మీ. కానీ ఇంటి డోర్ ఎవరూ తియ్యకపోయేసరికి బాగా ఏడ్చేసింది. ఇలా రష్మీ తన జీవితంలో జరిగిన ఇన్సిడెంట్స్ ని స్కిట్ రూపంలో చూపించేసరికి కన్నీరుమున్నీరయ్యింది. "తనకు తెలుగు మాట్లాడ్డం రాదు అనే స్థాయి నుంచి తెలుగు వాళ్ళందరూ తన గురించి మాట్లాడుకునే స్థాయికి ఎదిగింది రష్మీ" అని చెప్పాడు ఆది.