English | Telugu
'క్యాష్'లో దుల్కర్ సల్మాన్ తెలుగులో మాట్లాడాడా?
Updated : Jul 21, 2022
అన్ని కార్యక్రమాలకంటే సుమ క్యాష్ ప్రోగ్రాం బుల్లి తెర మీద చాలా ఫేమస్. ఎంతోమందితో ఆమె ఫన్ క్రియేట్ చేస్తూ ఉంటుంది. ప్రోగ్రాం మొత్తం కూడా నవ్వుతూ ఉండేలా చేస్తుంది. అంత ఎంటర్టైన్మెంట్ ఈ షో నుంచి అందుతుంది మనకు. అలాగే కొత్త మూవీ వస్తే చాలు ఆ మూవీ ప్రమోషన్స్ కూడా ఈ స్టేజి మీదే ఎక్కువగా చేస్తూ ఉంటారు.
ఇప్పుడు ఫేమస్ యాక్టర్ దుల్కర్ సల్మాన్ ఈ క్యాష్ షోలో కనిపించబోతున్నాడు. దుల్కర్ తన రాబోయే తెలుగు మూవీ 'సీతారామం' డైరెక్టర్ హను రాఘవపూడి, నటుడు సుమంత్ , డైరెక్టర్-యాక్టర్ తరుణ్ భాస్కర్‌తో కలిసి రాబోయే కాష్ ఎపిసోడ్ కి వచ్చి సందడి చేయబోతున్నారు. ఈ ప్రొమోషన్స్ కి సంబంధించిన ప్రోమో చిత్రాన్ని హీరో సుమంత్ తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో పోస్ట్ చేశారు.
మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ తెలుగులో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. 'మహానటి' మూవీలో జెమినీ గణేశన్ పాత్రలో నటించి ఎంతోమంది అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. 'సీతారామం'లో బాలీవుడ్ భామ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ పాత్ర పోషిస్తోంది. టీజర్, రెండు సాంగ్స్ తో పాటు, ఇటీవల ఒక వీడియోను విడుదల చేసారు. ఇందులో సుమంత్ వాయిస్ ఓవర్ కూడా ఉంది.
'జాతిరత్నాలు', 'మహానటి' మొదలైన బ్లాక్‌బస్టర్‌లను నిర్మించిన వైజయంతీ మూవీస్ దీన్ని నిర్మిస్తోంది. ఇదిలా ఉంటే, సుమ కనకాల కెరీర్‌లో సుదీర్ఘ కాలం నుంచి రన్ అవుతున్న 'క్యాష్' ప్రోగ్రాం ఒకటి. ఈ షో కి చాలామంది ఫేమస్ పర్సన్స్ వచ్చి సందడి చేస్తూ ఉంటారు. డైరెక్టర్ కె. రాఘవేంద్రరావు, దగ్గర్నుంచి నటి షకీల, అభినయశ్రీ, రాజశేఖర్ వంటివాళ్ళు ఈ షోలో కనిపించారు. అలాగే మూవీస్ లో కామెడీ పండించే జెన్నీ, కృష్ణవేణి, బాలాజీ, అల్లరి సుభాషిణి వంటి వాళ్ళు కూడా వచ్చి ఎంటర్టైన్ చేశారు.