English | Telugu
జంతువులను హింసించకండి
Updated : Jul 21, 2022
రష్మీ బుల్లి తెర మీద హీరోయిన్ రేంజ్ సంపాదించుకున్న యాంకర్. రష్మీ అటు జబర్దస్త్, ఇటు శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోస్ కి హోస్ట్ గా చేస్తూ పేరు తెచ్చుకుంది. రష్మీ కేవలం యాంకర్, యాక్టర్ మాత్రమే కాదు జంతు ప్రేమికురాలు కూడా . సెలెబ్స్ అంతా ఫోటోషూట్స్ తో ఎక్కువ సోషల్ మీడియాని షేక్ చేస్తూ ఉంటె రష్మీ రూటే సెపరేట్. మూగజీవులపై దాడులు జరిగినా, తనకు కనిపించే ఏ జీవికైనా హానీ జరుగుతున్నా తాను అస్సలు చూస్తూ ఊరికే ఉండదు. వెంటనే సమాజాన్ని ప్రశ్నిస్తుంది. ఎంతోమందిలో అవగాహన కల్పిస్తుంది. అలాంటి సంఘటనలను వీడియోస్ తీసి, ఫొటోస్ తీసి తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో వెంటనే షేర్ చేసేస్తుంది.
ఇప్పుడు లేటెస్ట్ గా అలాంటి ఒక సంఘటన జరిగింది. ఒక వ్యక్తి పాము చర్మాన్ని కోసి లాగుతున్న వీడియో పోస్ట్ చేసింది. ఈ పాము చర్మం ఎక్కువగా బ్రాండెడ్ హ్యాండ్ బాగ్స్ తయారీకి వాడుతూ ఉంటారు అని ఒక కంపెనీ పేరు కూడా పెట్టి. ఇలాంటి జీవాల చర్మాలతో చేసే బాగ్స్ ని వాడొద్దు. వేగన్ బాగ్స్ ని మాత్రం వాడండి. మార్పు మన నుంచే మొదలవ్వాలి అంటూ ఒక పోస్ట్ పెట్టింది రష్మీ. తనపై ఎన్ని రూమర్స్ వచ్చినా రష్మీ పెద్దగా లెక్క చేయదు. తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది.