English | Telugu

అవినాష్, శ్రీముఖి టైమింగ్, పంచ్ డైలాగ్స్ వేసే విధానం చాలా బాగుంటుంది!

బీబీ జోడి ప్రతీ వారం ఫుల్ ఎంటర్టైన్ చేస్తూ ఉంటుంది. ఇందులో జడ్జెస్ మాత్రం చాలా రొమాంటిక్ గా క్యూట్ గా ఉంటారు. జడ్జి సదా గురించి చెప్పక్కర్లేదు. ఎప్పుడూ ఫన్నీగా ఉంటుంది. ఇప్పుడు సదా తన కో-జడ్జెస్ తో రాపిడ్ ఫైర్ ఆడింది. ఆ వీడియోని తన యూట్యూబ్ ఛానల్ లో పోస్ట్ చేసింది. "మీ ఫేవరేట్ ప్లేస్ హైదరాబాద్ ఆర్ చెన్నై" అని రాధాను అడిగేసరికి "ముంబై అంటేనే చాలా ఇష్టం.. హైదరాబాద్ కొంచెం కొత్తగా ఉంది" అని అన్నారు. "నాకు ముంబై అంటే ఇష్టం వర్కింగ్ కి హైదరాబాద్" అంటే ఇష్టం అని చెప్పింది సదా. "మీ ఫస్ట్ క్రష్ ఎవరు" అని అడిగేసరికి "మలయాళంలో ప్రేమ్ నజీర్ ఒక పెద్ద హీరో...చాలా హ్యాండ్సమ్, ఫెయిర్, బ్యూటిఫుల్" అని చెప్పింది. "సెట్ లో మిమ్మల్ని బాగా ఎంటర్టైన్ చేసేది ఎవరు" అని అడిగేసరికి "అవినాష్ అంటే ఇష్టం ఎందుకంటే అతనిలో సెన్సాఫ్ హ్యూమర్ నాకు చాలా ఇష్టం " అని చెప్పింది. "నాకు శ్రీముఖి అంటే చాలా ఇష్టం..ఆమె టైమింగ్, పంచ్ డైలాగ్స్ బాగా నవ్వు తెప్పిస్తాయి" అని చెప్పింది సదా..

"సోషల్ మీడియాలో ఏ ప్లాటుఫారం మీకు ఇష్టం" అని అడిగేసరికి "నేను సోషల్ మీడియాలోకి ఇప్పుడే వచ్చాను. అప్ డేషన్ అనేది నాకు లేదు..నాకు వేరే వాళ్ళ హెల్ప్ కావాలి. క్యూట్ మూమెంట్స్ ని షేర్ చేసుకోవాలి అని అనుకుంటాను. మీ ఫోన్ లో ఎక్కువగా డయల్ చేసిన నంబర్ ఎవరిదీ" అని అడిగేసరికి "నేను అంత ఫోన్ పర్సన్ ని కాదు. నేను అసలు ఫోన్ వాడను. నాకు అసిస్టెంట్స్ ఉంటారు. నాకేం కావాలన్నా వాళ్ళే చూసుకుంటారు." అని చెప్పింది. "మీ పిల్లల్లో ఎవరిని చూస్తే మీకు టెన్షన్ వచ్చేది చిన్నప్పటినుంచి" "నా పిల్లలు చాలా కూల్..కానీ నేను చాలా స్ట్రిక్ట్ అనిపిస్తుంది. ఒక టైం వరకు బాగానే ఉంటాను..తర్వాత సీరియస్ ఐపోతాను" అని చెప్పింది రాధా. "మిమ్మల్ని ఇంట్లో ముద్దుగా ఏం పిలుస్తారు" అని అడిగేసరికి "మా అమ్మా, సిస్టర్స్ ముద్దుగా చంద్రి అని పిలుస్తారు..నా హస్బెండ్ మాత్రం జాను అని పిలుస్తారు" అని చెప్పింది. "నన్ను డార్లు" అని పిలుస్తారు అని చెప్పింది సదా.."మీ మీద వచ్చిన గాసిప్స్ లో మీకు నవ్వు తెప్పించింది" అని అడిగేసరికి " దిన తంతి అనే పేపర్ కి సంబంధించిన ఆయన వచ్చి చెప్పారు...ఏంటమ్మా ప్రతీ హీరోయిన్ కి ఏదో ఒక న్యూస్ ఉంటోంది. నీకు సంబంధించి ఒక్క న్యూస్ కూడా లేదు. నేను ఒక న్యూస్ రాసుకుంటా ..నువ్వు కోప్పడకు అన్నారు. ఎనీ పబ్లిసిటీ ఈజ్ గుడ్ పబ్లిసిటీ" అని రాసుకోమని చెప్పాను అన్నారు.

"నాకు ఫేమ్ వచ్చేవరకు గాసిప్స్ రాయమని నేనే చెప్పాను" అని అంది సదా. "డే మొత్తంలో కాఫీ ఆర్ టీ ఏది ఎక్కువగా తాగుతారు" అనేసరికి "నేను ఎక్కువగా అవి తాగను..కానీ కొన్ని సార్లు సాయంత్రం పూట కుర్కురే లాంటివి తింటూ కాఫీ తాగడం ఇష్టం" "నేను రోజుకు చిన్న చిన్న కప్స్ టీని ఐదు సార్లు తాగుతాను" అని చెప్పింది సదా. ఇలా సాగింది చిట్ చాట్ విత్ బీబీ జోడి జడ్జెస్.