English | Telugu

నేను కోరియోగ్రఫీ చేసే టైంకి డిజిటల్ మీడియా లేదు ఇప్పుడు జోక్స్ పేలుతున్నాయి!

బీబీ జోడి సెట్స్ లో సదా ఒక స్పెషల్ వీడియో చేసింది. చాలా మంది సెట్ కి వచ్చాకా ఆన్ స్క్రీన్ లో ఏం చేస్తారో మనకు తెలుస్తుంది. కానీ ఆఫ్ స్క్రీన్ టైములో వాళ్ళు ఎలా ఉంటారు..ఎలా ఫన్ క్రియేట్ చేస్తారు అనే విషయాన్నీ ఈ మధ్య చాలామంది వీడియోస్ తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు బీబీ జోడి జడ్జి సదా కూడా మిగతా జడ్జెస్ తో అలా ఒక ఫన్నీ వీడియో చేసింది. ఆ వీడియోని తన యూట్యూబ్ ఛానల్ లో పోస్ట్ చేసింది.

"మీ ఫేవరేట్ ప్లేస్ హైద్రాబాద్ ఆర్ చెన్నై" అని తరుణ్ మాస్టర్ ని అడిగింది "ఉండడానికి చెన్నై వర్కింగ్ కి హైదరాబాద్ అని చెప్పారు. మీ ఫస్ట్ క్రష్ ఎవరు అనేసరికి "నా ప్రొఫెషన్ నా ఫస్ట్ క్రష్ ఎందుకంటే కోరియోగ్రఫీ చేసేటప్పుడు అందమైన హీరోయిన్స్ వస్తారు. అప్పుడు వాళ్ళను క్లోజ్ అప్స్ వేయించి అలా మెల్ట్ చేసేసి నా దారిలోకి తెచ్చుకుంటాను. సెట్ లో మిమ్మల్ని బాగా ఎంటర్టైన్ చేసేది ఎవరు అన్న క్వశ్చన్ "డాన్స్ కోరియోగ్రఫీలో గణేష్ మాస్టర్ బీబీ జాడీలో ఆర్జే చైతు. ఎందుకంటే మేము ముగ్గురం ఒకే సైజులో ఉంటాం" అని చెప్పారు. "సోషల్ మీడియాలో ఏ ప్లాటుఫారం మీకు ఇష్టం" అని అడిగేసరికి "ఇన్స్టాగ్రామ్ చాలా ఇష్టం" "మీ ఫోన్ లో ఎక్కువగా డయల్ చేసిన నంబర్ ఎవరిదీ" అని అడిగేసరికి "నా భార్యకు, నా కూతురికి ఎక్కువ డయల్ చేస్తూ ఉంటాను" అని చెప్పారు. "మీ పిల్లల్ని ఎవరిని చూస్తే మీకు టెన్షన్ వచ్చేది చిన్నప్పటినుంచి" " నా కూతురు ఎందుకంటే చదువుట్లో ఫస్ట్ ఉంటుంది కానీ మిగతా విషయాల్లో కోపం, లేజినెస్ , సడెన్ గా మూడ్ బాగోనప్పుడు వెకేషన్ కి వెళదాం అంటే తీసుకెళ్లాల్సిందే" అని చెప్పారు. "మిమ్మల్ని ఇంట్లో ముద్దుగా ఏం పిలుస్తారు" అని అడిగేసరికి "ఏ తరుణ్ ఇట్రా" "మీమీద వచ్చిన గాసిప్స్ లో మీకు నవ్వు తెప్పించింది" నేను కోరియోగ్రఫీ చేసే టైంకి డిజిటల్ మీడియా లేదు ఇప్పుడు ఫుల్ గా ఉంది.

అక్కడక్కడా జోక్స్ పేలతా ఉంటాయి.." డే మొత్తంలో కాఫీ ఆర్ టీ ఏది ఎక్కువగా తాగుతారు" అనేసరికి " మార్నింగ్ ఒకే కాఫీ, సాయంత్రం టీ" అంతే అని తరుణ్ మాస్టర్ తో చిట్ చాట్ చేసింది సదా.