Read more!

English | Telugu

'నిన్ను మసాల్ వడ అని కాదు పిలుస్తోంది ముసలావిడ అని'

ఎంటర్టైన్మెంట్ కి పర్ఫెక్ట్ అడ్రస్ ఎక్స్ట్రా జబర్దస్త్ అని ఒక పాజిటివ్ కామెంట్ ఇచ్చేసారు పోసాని కృష్ణమురళి. ఇక నెక్స్ట్ వీక్ ఎక్స్ట్రా జబర్దస్త్ లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. కమెడియన్స్ అంతా మంచి స్కిట్స్ వేసి ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేశారు. 

ఇక ఇందులో అన్నపూర్ణ, ఆటో రాంప్రసాద్, బాబు కలిసి వేసిన స్కిట్ ప్రోమో కడుపుబ్బా నవ్వించింది. ఈ స్కిట్ లో కమెడియన్  బాబు లేడీ గెటప్ లో రాంప్రసాద్ కి భార్య క్యారెక్టర్ లో చేసాడు. అన్నపూర్ణ రాంప్రసాద్ కి అత్తగారిగా చేసింది. అల్లుడు ఇంటికి రావడంతోనే "బట్టలుతికావా" అని గదమాయించింది. "ఉతుకుతాను అత్తయ్య" అని రాంప్రసాద్ అనేసరికి "ఒక్కపని చేయడం సరిగా చేయడం చేతకాదు" అని సీరియస్ అయ్యింది .." "నువ్వింతకు ఆడదానివేనా ?" అని సీరియస్ అయ్యాడు రాంప్రసాద్.

 " నేను ఆడదాన్నే బయటికి వెళితే అందరూ నన్ను మసాల్ వడ, మసాల్ వడ అంటున్నారు అంది అన్నపూర్ణ. "మసాల్ వడ కాదు అది ముసలావిడ" అని అంటున్నారు నిన్ను అన్నాడు రాంప్రసాద్.."మా డబ్బులన్నీ నువ్వే ఎత్తుకుపోతున్నావ్ అని సీరియస్ గా అనేసరికి రాంప్రసాద్ దుడ్డుకర్రతో ఒక్కటి ఇచ్చాడు. దాంతో అన్నపూర్ణ స్పృహ తప్పి పడిపోయింది.. ఇక డాక్టర్ గెటప్ లో శీను వచ్చి కామెడీ పండించాడు. ఇలా ఈ రాబోయే వారం స్కిట్స్ అన్నీ కూడా బాగా అలరించనున్నాయి.