English | Telugu

క్లాస్ రూమ్‌లో లాస్ట్ బెంచీలో కూర్చుని మీ సీరియల్ చూస్తాం!

'గుప్పెడంత మనసు' సీరియల్ లో వసుధార తెలుగు ఆడియన్స్ కి బాగా పరిచయమే. వసుధార అలియాస్ రక్షా గౌడ సోషల్ మీడియాలో కూడా ఫేమస్ అయ్యింది. ఇప్పుడు వసుధార తన ఇన్స్టాగ్రామ్ పేజీలో "టెల్ మీ యువర్ సీక్రెట్స్" అంటూ నెటిజన్స్ కి టాస్క్ ఇచ్చింది. వాళ్ళు చేసిన పనులు చెప్పేసరికి వసుధార వాటికి రిప్లైస్ కూడా ఇచ్చేసింది. "నేను బలపాలు తింటాను, మీరు తింటారా?" అని అడిగేసరికి వసుధారా "నో" అంటూ తల ఊపుతూ చెప్పింది. "నాకు సైకిల్ తొక్కడం రాదు.. ఇదే నా బిగ్ సీక్రెట్" అని మరో నెటిజన్ చెప్పేసరికి "నాకు రాదు" అన్నట్టుగా హైఫై ఎమోజిస్ ని పోస్ట్ చేసింది వసు.

"నేను మా నాన్న పర్సులో డబ్బులు కొట్టేసాను.. మీరు" అని ఇంకో నెటిజ‌న్ అడిగితే, "నేనూ డబ్బులు కొట్టేసాను" అని చెప్పింది వసు. "నేను, మా ఫ్రెండ్ లాస్ట్ బెంచ్ లో కూర్చుని మీ 'గుప్పెడంత మనసు' సీరియల్ చూస్తాము.. ఇదే మా బిగ్గెస్ట్ సీక్రెట్" అని ఇంకో నెటిజ‌న్ చెప్పారు. దానికి " చాలా మంచిది, కానీ దొరక్కుండా చూసుకోండి టీచర్స్ కి" అని రిప్లై ఇచ్చింది వసు.

"మా ఫ్రెండ్స్ పర్సులు కొట్టేసి ఆ డబ్బులతో వాళ్ళకే పార్టీ ఇస్తాము.. మరి మీరు" అని మరో నెటిజన్ అడిగేసరికి "నేనెప్పుడూ ఇలా చేయలేదు.. కానీ భలే గ్రేట్ ఐడియా" అంటూ రిప్లై ఇచ్చింది. ఇలా నెటిజన్స్, వసు వాళ్ళ వాళ్ళ సీక్రెట్స్ చెప్పేసుకున్నారు.