English | Telugu

BiggBoss Season 7 Telugu: బిగ్ బాస్ రాజ్యంలో రాజమాతలు తీసుకున్న నిర్ణయం అదేనా?

బిగ్ బాస్ సీజన్ -7 తొమ్మిది వారాలు పూర్తిచేసుకొని పదోవారానికి అడుగుపెట్టింది‌. తొమ్మిదవ వారం టేస్టీ తేజ ఎలిమినేషన్ అవ్వగా.. పదవ వారం హౌస్ నుండి ఎవరు బయటకు వెళ్తారో వారి కోసం బిగ్ బాస్ నామినేషన్ ప్రక్రియను ప్రారంభించాడు. బిగ్ బాస్ రాజ్యం(బిగ్ బాస్ హౌస్) లో ఉన్న ఆడవాళ్ళు రాజమాతలుగా, మిగిలిన వాళ్ళు ప్రజలుగా ఉంటారని బిగ్ బాస్ చెప్పాడు. ఈ ప్రక్రియలో భాగంగా శంఖం వచ్చిన ప్రతీసారీ ప్రజలిద్దరు వచ్చి గార్డెన్ ఏరియాలో ఉన్న ఒరలలోని కత్తులని తీసి వారి నామినేషన్ ప్రక్రియని మొదలుపెట్టాలని బిగ్ బాస్ చెప్పాడు. ఇలా సోమవారం జరిగిన నామినేషన్ ప్రక్రియ వాడివేడీగా సాగింది.

భోలే షావలిని అమర్ దీప్ నామినేట్ చేశాడు. బ్లాక్ బాల్ మీకు వచ్చినప్పుడు మీరు తీసుకొని వస్తే బాగుండని రీజన్ చెప్పి అమర్ దీప్ నామినేట్ చేశాడు. కొన్ని రాజకీయ కారణాల వల్ల అక్కడ నుండి వచ్చేశానని భోలే షావలి అన్నాడు. సింహం, ఎలుకలతో ఎదవ కంపారిజన్ వద్దన్న అని భోలే షావలిని అమర్ దీప్ అన్నాడు. గౌతమ్ కృష్ణని అంబటి అర్జున్ నామినేట్ చేశాడు. " శివాజీ గారు అందరిని ఇన్ ఫ్యూయన్స్ చేశాడు" అని నువ్వు అలా ఎలా అలిగేషన్ చేస్తావని గౌతమ్ కృష్ణతో అంబటి అర్జున్ నామినేట్ చేశాడు.

ఆ తర్వాత గౌతమ్ కృష్ణని పల్లవి ప్రశాంత్ నామినేట్ చేశాడు. అమర్ దీప్ ని యావర్ నామినేట్ చేశాడు. అమర్ దీప్ ని భోలే షావలి నామినేట్ చేశాడు. రివేంజ్ నామినేషన్ చేశావని భోలే షావలి అన్నాడు. పొడిపించినవ్ అమ్మ అని ప్రియాంక జైన్ ని భోలే షావలిని అన్నాడు. మాటల మధ్యలో.. " నాలాగా మాడ్లాడటం నువ్వు నేర్చుకోలేవు" అని అశ్వినిని ప్రియాంక అంది.

అయితే ఈ నామినేషన్ ప్రక్రియలో రాజమాతలుగా ఉన్న ప్రియాంక, రతిక, అశ్వినిశ్రీ, శోభాశెట్టి లు నలుగురు కలిసి ఏకాభిప్రాయంతో నామినేట్ చేసిన వారి రీజన్స్ ని పరిశీలించి ఏది ఎక్కువ కరెక్ట్ అనిపిస్తే వారిని నామినేట్ చేయాలని చెప్పడంతో.. శోభాశెట్టి, ప్రియాంక జైన్ ఇద్దరు కలిసి అమర్ దీప్ ని సేవ్ చేశారు. నలుగురు రాజమాతలలో ఎవరు అన్ డిజర్వింగ్ అనిపిస్తుందో ఏకాభిప్రాయంతో నిర్ణయించుకోండని అనగా.. రతికకి రెండు ఓట్లు, ప్రియాంకకి రెండు ఓట్లు వచ్చి టై అవ్వడంతో.. కెప్టెన్ గా శోభాశెట్టిని నిర్ణయం తీసుకోమని బిగ్ బాస్ చెప్పగా.. తను ప్రియాంక పేరు చెప్పకుండా రతిక పేరు చెప్పింది. దాంతో రతిక నామినేషన్ లో ఉంది. ఇక చివరగా భోలే షావలి, శివాజీ, ప్రిన్స్ యావర్, గౌతమ్ కృష్ణ, రతిక నామినేషన్ లో ఉన్నారు.