English | Telugu

శైలేంద్ర మాస్టర్ ప్లాన్ ని జగతి కనిపెట్టగలదా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -828 లో.. కాలేజీ మీటింగ్ లో తనకి జరిగిన అవమానం గుర్తుచేసుకొని శైలేంద్ర కోపంగా ఉంటాడు. అప్పుడే ధరణి కాఫీ తీసుకొని వచ్చి శైలేంద్రకి ఇస్తుండగా.. కాఫీనీ గోడకి కొడతాడు. అప్పుడే జగతి వచ్చి.. నీ ఫ్రస్ట్రేషన్ కి నువ్వు బాధ్యుడివి, దానిని ధరణిపై ఎందుకు చూపిస్తున్నావని జగతి కోప్పడుతుంది. ఆ తర్వాత నీకు సంబంధం లేని విషయం నువ్వు కలుగజేసుకోకని శైలేంద్ర అంటాడు. మీరు అన్యోన్యంగా ఉంటే మీ విషయంలో ఎవరు కలుగజేసుకోరు.. ఇలా ఉంటేనే కలుగుజేసుకోవాల్సి వస్తుందని జగతి అంటుంది. ఒకసారి ధరణి నీకు ఎదురు తిరిగి మాట్లాడితే నీ పరిస్థితి ఏంటని శైలేంద్రతో జగతి అంటుంది. అలా జగతి అనేసరికి శైలేంద్ర సైలెంట్ గా ఉండిపోతాడు.

మరొకవైపు ఏంజిల్, రిషి ఇద్దరు కార్ లో ఇంటికి వెళ్తు మాట్లాడుకుంటారు. నిన్ను ఒక విషయం అడుగుతాను నిజం చెప్తావా అని రిషితో ఏంజిల్ అంటుంది. చెప్పగలిగేలా ఉంటే చెప్తానని రిషి అంటాడు. నీకు వసుధారకి మధ్య ఏం ఉంది.. బద్ద శత్రుత్వమైనా ఉండాలి లేదా ప్రేమైనా ఉండాలని ఏంజిల్ అంటుంది. మిమ్మల్ని చూసిన ప్రతీసారి నాకు ఇదే డౌట్ వస్తుందని ఏంజిల్ అంటుంది. రిషి మాత్రం ఏం చెప్పడు. అది అనవసరమైన విషయం వదిలేయమని, ఎవరికైనా పర్సనల్ ఉంటుంది అది బయటపెట్టవద్దని రిషి అంటాడు. నా పర్సనల్ అన్ని నీతో షేర్ చేసుకున్నా కదా అని ఏంజిల్ అంటుంది. నేను షేర్ చేసుకోను అనవసరమైన దాని గురించి అలోచించకని ఏంజెల్ తో రిషి అంటాడు. రిషి వాళ్ళ మధ్య ఏం లేదని చెప్పడం లేదు అంటే కచ్చితంగా ఉంది అన్నట్లే కదా అని ఏంజిల్ తన మనసులో అనుకుంటుంది. మరొక వైపు జగతి, మహేంద్ర‌ ఇద్దరు మీటింగ్ లో.. శైలేంద్ర పదే పదే వాళ్ళ పేర్లు చెప్పండని అడుగుతున్నాడని మహేంద్రతో అంటుంది జగతి. వాళ్ళ మాటలు చాటుగా శైలేంద్ర వింటాడు.

ఆ తర్వాత మరుసటి రోజు ఉదయం శైలేంద్రకి కాలేజీ బాయ్ ఫోన్ చేసి.. కాలేజీలో వసుధార, రిషిల మధ్య గొడవ జరిగిన విషయం చెప్తాడు. కాలేజీలో వాళ్ళ మధ్య ఏదో ఉందనేలా డౌట్ క్రియేట్ చేసానని కాలేజీ బాయ్ చెప్తాడు. రాత్రి వసుధర దగ్గరికి రిషి వెళ్ళాడని చెప్తాడు. ఆ తర్వాత వసుధార, రిషీల ఎంగేజ్మెంట్ ఫోటో ఒకటి కాలేజీ బాయ్ కి శైలేంద్ర పంపించి.. ఈ ఫోటోని కాలేజీలోని అన్ని గోడలపై అతికించు.. అందరి ముందు వాళ్ళ పరువు పోవాలని కాలేజీ బాయ్ కి శైలేంద్ర చెప్తాడు. అప్పుడే శైలేంద్ర ఎవరితోనో ఫోన్ లో మాట్లాడుతున్నాడని జగతి గమనించి తన దగ్గర ఉన్న వసుధార, రిషీల ఎంగేజ్మెంట్ ఆల్బమ్ చూసి.. ఆ ఆల్బమ్ అక్కడ ఎందుకు ఉందని అనుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.