English | Telugu

ఇంటికి రమ్మని స్వప్న రాహుల్ కి గ్రీన్ సిగ్నల్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్-90లో.. కనకం ప్లాన్ సక్సెస్ కావడంతో పదహారు రోజుల పండుగ కోసం కావ్యని వాళ్ళ పుట్టింటికి పంపడానికి అపర్ణ ఒప్పుకుంటుంది. మరోవైపు రాజ్ తన గదిలో కోపంగా ఊగిపోతుంటాడు. తన గదికి వెళ్ళిన అపర్ణ.. కోపంగా ఉండకు.. ఆలోచించు.. ఓపికగా ఉండు.. ఇంకొన్ని రోజుల్లో కావ్య ఇంటి నుండి వెళ్ళిపోతుంది.. నువ్వు ఎంత ఓపికగా ఉంటే ప్రతిఫలం అంత గొప్పగా ఉంటుంది.. ఎట్టి పరిస్థితుల్లోనూ కావ్యని కండిషన్ మీద ఇక్కడ ఉంచినట్టు ఎవరికీ చెప్పకు.. రెండు రోజుల్లో తన తప్పు అందరికి తెలుస్తుందని అపర్ణ అంటుంది. వాళ్ళ ఆటలు సహించలేకపోతున్నా అమ్మ అని రాజ్ అంటాడు. కొన్ని రోజులు ఓపికగా ఉండమని అపర్ణ అంటుంది.

ఆ తర్వాత కనకం వాళ్ళ అక్క మీనాక్షి కి కాల్ చేసి కావ్య పదహారు రోజుల ఫంక్షన్ కి రమ్మని చెప్తుంది. మీనాక్షి మాత్రం భయపడుతూ మొదట రానని చెప్పినా తర్వాత వస్తానని ఒప్పుకుంటుంది. మరోవైపు కనకం-కృష్ణమూర్తి, అప్పులు గుడికి బయల్దేరుతుండగా స్వప్న ఎదురొస్తుంది. శకునం మంచిది కాదని కనకం అంటుంది. ఆ తర్వాత రోగం వచ్చింది.. నేను రానని అప్పు అంటుంది. అదేం రోగమే అని కనకం అడుగగా.. అక్క ఒక్కతే ఉంటుంది కదా తోడుగా నేనుంటానని అప్పు అంటుంది. రాహుల్ ని ఎలా కలవాలని స్వప్న తనలో తను అనుకుంటుంది. నేను ఫ్రెండ్స్ తో సినిమాకి వెళ్తున్నా నువ్వు ఇంట్లోనే ఉండమని అప్పు చెప్పి బయటకు వెళ్ళిపోతుంది.

దుగ్గిరాల ఇంట్లో కావ్య తన గదిని సర్దుతుంటుంది. అప్పుడే అక్కడికి రాజ్ వాళ్ళ అమ్మ అపర్ణ వస్తుంది. అందరూ కలిసి నా కొడుకిని అమాయకుడిని చేసి మీ గదిగా మార్చారని అపర్ణ అంటుంది. ఇంతకి ఎందుకొచ్చారని కావ్య అడుగగా.. సారె ఇద్దామని వచ్చానని అపర్ణ అంటుంది. మరీ అంత సంబరపడిపోకు.. నాకిష్టం లేకపోయినా, నా కొడుకి ఆయుష్షు తగ్గొద్దని దీనికి ఒప్పుకున్నానని అపర్ణ అంటుంది. ఆ తర్వాత గుడికి కనకంతో పాటు మీనాక్షి వస్తుంది. మరోవైపు రాహుల్ కి స్వప్న కాల్ చేసి.. నీకో సర్ ప్రైజ్ అని చెప్తుంది. ఏంటని రాహుల్ అడుగగా.. ఇంట్లో నేను తప్ప ఎవరు లేరని నువ్వు వస్తే బాగుంటుంది. మనకి ఇలాంటి రొమాంటిక్ టైం మళ్ళీ రాదని చెప్తుంది. అర్జెంట్ గా మా ఇంటికొచ్చేయ్ అని స్వప్న అడుగగా.. రాహుల్ ఇరిటేట్ అవుతాడు. నువ్వు ఇక్కడికి రాకపోతే నేనే అక్కడికి వస్తానని బ్లాక్ మెయిల్ చేస్తుంది స్వప్న. వద్దని రాహుల్ చెప్తాడు. మరి ఇక్కడికి వస్తావా అంటే.. లేదు.. నాకు నచ్చిన ఒక ప్లేస్ ఉంది‌ నేను లొకేషన్ పంపిస్తాను.. మనమిద్దరం ఆ ప్లేస్ లో కలుసుకుందామని రాహుల్ చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial : గంగ, రుద్ర పూజలో కూర్చుంటారా.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -164 లో..... రుద్ర ఏ విధంగా గంగకి హెల్ప్ చేసాడో అందరికి చెప్తాడు. పాపం పెద్దమ్మ హర్ట్ అయినట్లు ఉందని వంశీ అనగానే అయితే అవనివ్వులే గంగ సేఫ్ అయిందని పెద్దసారు అంటాడు. మరొకవైపు పారు ఫ్రెండ్స్ ని అకాడమీ మేడమ్ సస్పెండ్ చేస్తుంది. దాంతో నువ్వు సస్పెండ్ ఆపకపోతే నువ్వే ఇదంతా చేసావని మేడమ్ కి చెప్తానని పారు ఫ్రెండ్ పారుతో అంటుంది. దాంతో మేడమ్ ని సస్పెండ్ క్యాన్సిల్ చెయ్యమని రిక్వెస్ట్ చేస్తుంది పారు. తప్పు ఒప్పుకుంటున్నారు కదా ఈ ఒక్కసారి క్షమించండి అని మేడమ్ తో గంగ అనగానే తను సరే అని సస్పెన్షన్ క్యాన్సిల్ చేస్తుంది.

ఆ మీమ్ నన్ను చాలా డిస్టర్బ్ చేసింది...సావండి అంటున్న నైనికా అనసుర

నైనికా అనసురు బుల్లితెర మీద అందరికీ పరిచయమే. బిగ్ బాస్ సీజన్ 8 ద్వారా బాగా ఫేమస్ అయ్యింది. అలాగే ఢీ డాన్స్ షోలో డాన్స్ ద్వారా బాగా పాపులర్ అయ్యింది. ఇక ఇప్పుడు బిబి జోడి సీజన్ 2 లో అమరదీప్ కి జోడిగా చేస్తోంది. అలాంటి నైనికా రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో ఘాటుగా ఒక పోస్ట్ పెట్టింది. "ఎలాంటి పని లేకుండా జస్ట్ కూర్చుని అమ్మాయిల చిత్రాలను ఘోరంగా ఎడిట్ చేస్తూ వాళ్ళను హరాస్ చేసే ఒక స్టుపిడ్ మీమ్ పేజీలో పోస్ట్ చేసిన నా చిత్రాలు నన్ను చాలా డిస్టర్బ్ చేశాయి. మీకు పని లేదు బ్రో, మాకు మిమ్మల్ని పట్టించుకునేంత టైం లేదు. నువ్వు మా మీద పోస్ట్లు పెడుతున్నావ్ అంటే నువ్వు నీలోనే తోపు ఐనట్టే..మీ పేరెంట్స్ నిన్ను బాగా పెంచారు. మీలాంటి వాళ్ళే రేపు రేపిస్టుల్లా తయారవుతారు.