English | Telugu

రతిక కాళ్ళ దగ్గర యావర్.. ఆట మొదలుపెట్టిన రాధిక!

బిగ్ బాస్ హౌస్ లో గ్రాంఢ్ ఎంట్రీ 2.0 తర్వాత చాలా ట్విస్ట్ లు ఇచ్చాడు బిగ్ బాస్. ఎలిమినేషన్ అయి‌ బయటకు వెళ్ళిన శుభశ్రీ, దామిణి, రతికలకు బిగ్ బాస్ మరొక అవకాశం ఇచ్చి, హౌస్ లోని వారిని ఓట్ చేయమని చెప్పాడు.‌ ఇక లీస్ట్ లో ఎవరుంటారో వారికే హౌస్ లోకి ఎంట్రీ అని చెప్పాడు బిగ్ బాస్. రతికకి తక్కువ ఓట్లు రావడంతో తనే హౌస్ లోకి వచ్చేసింది.


రతిక వచ్చీరాగానే శివన్న అంటు హగ్ ఇచ్చి క్షమాపణలు కోరింది. ఇక పల్లవి ప్రశాంత్ రసగుల్ల తినిపించాడు. నాలుగు రోజులు మాములుగా ఉన్న రతికని చూసి.. ఆట మొత్తం చూసి వచ్చినట్టుంది, ఇక మారింది అని అనుకున్నారంతా కానీ పాత రతిక అలియాస్ రాధిక అలానే ఉందని తెలిసింది. ప్రిన్స్ యావర్ ని బెడ్స్ దగ్గర కూర్చోబెట్టుకొని మరీ ఎవరేంటి అని మాట్లాడుతుంది. ప్రియాంక, అమర్, శోభా, ఆట సందీప్ ఒక బ్యాచ్ అని బెడ్ మీద కూర్చొని ఉన్న రతికతో యావర్ బెడ్ కింద కూర్చొని చెప్తున్నాడు. సుదీర్ఘంగా సాగిన ఈ సంభాషణలో యావర్ ని రతిక పూర్తిగా తన స్ట్రాటజీతో మార్చేస్తుందేమోనని అనిపిస్తుంది. మనమిద్దరం కలిసి ఒక్కొక్కరిని బయటకు పంపించేద్దామని యావర్ తో రతిక చెప్తుంది. ఇక గేమ్ స్టార్ట్ అన్నట్టు రతిక ఫీల్ అయింది.

అయితే రతిక అంతటితో ఆగకుండా.. "మనమిద్దరం అప్పుడు ఒకే ప్లేట్ లో చపాతీలు తిన్నాం కదా అది ప్రియాంక చూసి లవ్ బర్డ్స్ అని అందంట. మన ఇద్దరి మనసులో ఏం లేదు. ఇద్దరం ఫ్రెండ్స్ మే కదా" అంటూ ప్రియాంకని యావర్ నెక్స్ట వీక్ నామినేట్ చేసేలా స్ట్రాటజీ స్టార్ట్ చేసింది రతిక. అయితే రతిక దెబ్బకి యావర్ బుద్దిగా వింటున్నాడని తెలుస్తుంది. మరి రతిక చెప్పిన ఈ మాటలని యావర్ సీరియస్ గా తీసుకుంటాడా? లేదా తన గేమ్ తను ఆడతాడో చూడాలి మరి.