English | Telugu

ఇమ్ము హెయిర్ స్టైల్ నచ్చి టాటూ వేయించుకున్న ఆనంద్ దేవరకొండ

సుమ అడ్డా నెక్స్ట్ వీక్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఈ షోకి "గంగం గణేశా " మూవీ టీమ్ నుంచి ఆనంద్ దేవరకొండ, ఇమ్మానుయేల్, యావర్, నయన్ సారిక వచ్చారు. రావడంతోనే ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు. ఆనంద్ దేవరకొండను తన బెస్ట్ ఫ్రెండ్ గా పరిచయం చేసాడు ఇమ్ము. ఇలాంటి ఫ్రెండ్ ఎలా దొరికాడంటూ సుమ సెటైర్స్ వేసింది..తన పేరును మెడ మీద టాటూగా వేయించుకున్నాడంటూ ఆనంద్ మెడ మీద టాటూని చూపించాడు ఇమ్ము. దాన్ని చూసి సుమ షాక్ అయ్యింది. "ఆనంద్ ఇమ్ములో ఎం చూశాడని టాటూ వేయించుకున్నాడు" అని అడిగింది సుమ. తనకు ఇమ్ము హెయిర్ స్టైల్ అంటే చాలా ఇష్టం అని చెప్పాడు ఆనంద్.

ఇక హీరో హీరోయిన్స్ మధ్యకు వచ్చి టీ అమ్ముతూ ఉండగా ...అల్లం చాయ్ కావాలని హీరోయిన్ నయన్ సారిక అడిగింది. "అల్లం బెల్లం నువ్వు నా పెళ్ళాం" అని చెప్పి షాక్ ఇచ్చాడు ఇమ్ము. తర్వాత ఆనంద్ దేవరకొండ, ఇమ్ము, యావర్ కలిసి బేబీ 2 పెర్ఫార్మెన్స్ చేసి చూపించారు. ఇమ్ము బేబీగా చేసాడు..తనకు పెళ్ళైనా కూడా విరాజ్, ఆనంద్ కావాలనిపిస్తోంది సుమని అడిగేసరికి షాక్ అయ్యింది. ఆ తర్వాత యావర్, ఇమ్ము ఇద్దరూ కలిసి ఒక రొమాంటిక్ పెర్ఫార్మెన్స్ కి మంచి స్టెప్స్ వేసి ఎంటర్టైన్ చేసారు. మే 31 న ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. ‘బేబీ’ లో ఎమోషన్ బాగా పండించిన ఆనంద్ దేవరకొండకు ఈ క్రైమ్ కామెడీ జోనర్ కలిసొస్తుందా లేదా చూడాలి.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.