English | Telugu
ఈమె ఎవరో గుర్తుపట్టారా..?
Updated : May 26, 2024
యాంకర్ గా, బిగ్ బాస్ కంటెస్టెంట్ గా, మూవీస్ లో నటిగా ఆమె అందరికీ తెలిసిన అమ్మాయే. "అ,ఆ" మూవీలో సమంతకి ఫ్రెండ్ రోల్ లో నటించి ఫుల్ కామెడీ టైమింగ్ తో అలరించింది. ఆమె గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. కెరీర్ స్టార్టింగ్ లో "ఆడవారి మాటలకు అర్థాలే వేరులే" వంటి మూవీస్ లో అలాగే పలు సీరియల్స్ లో నటించింది. తర్వాత బిగ్ బాస్ సీజన్ 1 కి వెళ్ళింది. అందులో హరికథలు, బుర్రకథలు చెప్పి స్ట్రాంగ్ లేడీ కంటెస్టెంట్ గా ఫైనల్ వరకు వెళ్ళింది. వరుస సినిమా అవకాశాలను సంపాదించుకుంది. ఐతే లాక్ డౌన్ టైంలో కొంత అవకాశాలైతే తగ్గాయి. లాక్ డౌన్ కి ముందర ప్రెగ్నెన్సీ కారణంగా కొంత లావు కావడం..అవకాశాలు తగ్గడంతో ఆ తర్వాత వర్కౌట్స్ చేసి ఫిట్ అయ్యింది. ఆ లావు తగ్గడం వలన సన్నజాజిలా మల్లెతీగలా ఐపోయింది.
సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. ఫారెన్ ట్రిప్స్ వెళ్తూ ఆ పిక్స్ ని వీడియోస్ ని పోస్ట్ చేస్తుంది. రీసెంట్ గా అల్లరి నరేష్ తో కలిసి "ఆ ఒక్కటి అడక్కు" అనే మూవీలో నటించింది. ఐతే రాను రాను ఈ అమ్మడు బక్కచిక్కి కనిపిస్తోంది. కూతురు భూమితో కలిసి ఎంజాయ్ చేయడం ఎంతో ఇష్టమైన పని కూడా. అలాగే షాప్ ఓపెనింగ్స్ కూడా వెళ్తూ ఆ వీడియోస్ ని కూడా పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఐతే ఈ పిక్ లో ఉన్న అమ్మాయిని గుర్తు పట్టారా ఎవరైనా ? హా గుర్తుపట్టే వుంటారు.. ఆమె హరి తేజ.