English | Telugu
నా డాన్స్ కి ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే అంటున్న గాజువాక డిపో లేడీ కండక్టర్
Updated : Aug 24, 2022
అన్ని షోస్ లోకి ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీ ఫుల్ స్పీడ్ మీద ఉంది. ఈ షోలో ఎంటర్టైన్మెంట్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. బుల్లి తెర మీద ఇప్పుడు ఈ షో మిగతా షోస్ తో ఈక్వల్ గా పరిగెడుతోంది. జబర్దస్త్ లాగే ఈ షోకి కూడా జడ్జెస్ పర్మనెంట్ గా ఉండరు. ప్రతీ వారం కొత్త కొత్త జడ్జెస్ హాయ్, హాయ్ చెప్తారు..అంతలోనే బై బై చెప్పేస్తారు. నిన్న, మొన్నటివరకూ ఈ షోకి జడ్జిగా పూర్ణ, ఇంద్రజ వచ్చి సందడి చేస్తే..ఇక ఈ వారం జడ్జిగా నటి ఆమని సందడి చేయనుంది. లేటెస్ట్ ఈ షో ప్రోమో రిలీజ్ చేశారు నిర్వాహకులు. ఈ ప్రోమో చూస్తే చాలు మొదటి నుండి చివరి వరకు ఫుల్ జోష్ తో సాగినట్లు కనిపిస్తోంది. ఇక ఈ షోకి హైలైట్ గా నిలిచింది లేడీ కండక్టర్.
ఏపిఎస్ ఆర్టీసీ గాజువాక బస్ డిపోకి చెందిన లేడీ కండక్టర్ ఇరగదీసి చేసిన డాన్స్ కి అందరూ ఫిదా ఇపోయారు. ఆమని ఐతే ఆ డాన్స్ చూసి తనకు కూడా అలా చేయాలనిపించింది అని చెప్పేసరికి ఆ కండక్టర్ వెంటనే ఆమనితో, రష్మీతో కలిసి మళ్ళీ డాన్స్ చేసింది. వాళ్ళతో పాటు ఆది, చంటి, రాంప్రసాద్, భాస్కర్, నరేష్, ఇమ్ము అందరూ డాన్స్ చేశారు. మధ్యలో హైపర్ ఆది, ఆటో రాంప్రసాద్, బుల్లెట్ భాస్కర్ కామెడీ పర్లేదనిపించింది. ఈ లేడీ కండక్టర్ డాన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది.