English | Telugu
నడవలేని స్థితిలో పంచ్ ప్రసాద్!
Updated : Nov 18, 2022
పంచ్ ప్రసాద్ పేరు 'జబర్దస్త్', 'శ్రీదేవి డ్రామా కంపెనీ' చూసేవాళ్లకు బాగా తెలుసు. అప్పటికప్పుడు పంచులు, జోకులు వేస్తూ ఉంటాడు ప్రసాద్. ఐతే ఇతను కిడ్నీ ప్రాబ్లమ్ తో బాధపడుతున్న విషయాన్నికూడా అన్ని స్టేజెస్ మీద చెప్తూనే ఉంటాడు. ఎన్ని సమస్యలు ఉన్నా నవ్వించడంలో మాత్రం ఎక్కడా తగ్గేవాడు కాదు.రీసెంట్‌గా ప్రసాద్ మరో సమస్యతో బాధపడుతున్నాడు.
ప్రతీ వారం డయాలసిస్ చేయించుకుని వచ్చిఆడియన్స్‌ని నవ్విస్తూ ఉండే ప్రసాద్ ఇప్పుడు నడవలేని స్థితిలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. జబర్దస్త్ కమెడియన్స్ నూకరాజు, ఆసియా వారం నుంచి ప్రసాద్ ఇంట్లోనే ఉంటూ వాళ్లకు సాయం చేస్తున్నామని చెప్పారు.
ఇక పంచ్ ప్రసాద్ భార్య చెప్పిన దాని ప్రకారం.. ఓరోజు షూటింగ్ తర్వాత ఇంటికొచ్చేసరికి ఫుల్ ఫీవర్‌తో, నడుము నొప్పితో చాలా బాధపడేసరికి హాస్పిటల్ తీసుకెళ్లి అన్ని టెస్టులు చేయించామని, ఐతే నడుము వెనక వైపు కుడికాలి వరకు చీము పట్టినట్లు డాక్టర్స్ చెప్పారని చెప్పింది. ఇదంతా నూకరాజు ఒక వీడియో చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. అభిమానులు కూడా ప్రసాద్‌కి సపోర్ట్ చేయాలని నూకరాజు ఈ వీడియో ద్వారా కోరాడు.