English | Telugu
ఈ ఏడాది ఇలా మొదలవుతుందని అనుకోలేదు...ఇదే చివరి సారి కావాలి...
Updated : Jan 3, 2023
పునర్నవి భూపాళం అంటే తెలియని వారు లేరు. బిగ్ బాస్ తో ఈ అమ్మడు ఫుల్ ఫేమస్ అయ్యింది. కొంత మంది సెలెబ్రిటీస్ గుడ్ న్యూస్ చెప్తూ ఉంటే కొత్త సంవత్సరంలో బాడ్ న్యూస్ చెప్పింది పున్ను. దీంతో ఆమె ఫాన్స్ చాలా బాధపడుతున్నారు. ప్రస్తుతం పునర్నవి లంగ్స్ కి సంబంధించి వ్యాధితో బాధపడుతున్నట్లుగా ట్విట్టర్ లో పోస్ట్ చేసింది.
ఇక ఇదే విషయానికి సంబంధించి ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో ఫొటోస్ పెట్టింది. “నా న్యూ ఇయర్ చెస్ట్ పెయిన్ తో మొదలైంది. నేను ఇలా అనారోగ్యానికి గురి కావడం అనేది ఇదే చివరి సారి కావాలని కోరుకుంటున్న" అని పోస్ట్ పెట్టింది. పునర్నవి బాధను చూసి తట్టుకోలేని నెటిజన్స్ త్వరగా కోలుకోవాలని మెసేజెస్ పెడుతున్నారు. ఈమె "ఉయ్యాలజంపాల" మూవీతో డెబ్యూ చేసినా కూడా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళాక మాత్రం ఈమె పేరు బాగా మోత మోగింది. అందులోనూ రాహుల్ సిప్లిగంజ్ తో నడిపిన లవ్ ట్రాక్ట్ వేసిన డ్యూయెట్ డాన్స్ తో ఆడియన్స్ ని బాగా అట్ట్రాక్ట్ చేసింది. వీళ్ళ మధ్య సంథింగ్ సంథింగ్ ఉందంటూ అప్పట్లో పుకార్లు షికార్లు చేశారు.
ప్రస్తుతం ఈమె లండన్ లో సైకాలజీలో హయ్యర్ స్టడీస్ చేస్తోంది. "కమిట్మెంట్" అనే వెబ్ సిరీస్ లో ఈమె నటించింది. పునర్నవి తన విషయాలన్నీ కూడా ఇన్స్టా లో షేర్ చేసుకుంటూ ఉంటుంది. టైం దొరికినప్పుడల్లా నెటిజన్స్, ఫాన్స్ తో లైవ్ చాట్ చేస్తూ ఉంటుంది. ఈ మధ్య ఆమె తెర మీద ఎక్కడా కనిపించడం లేదు. ఫేస్ టు ఫేస్ మాట్లాడే పునర్నవికి ఆఫర్స్ కూడా తగ్గిపోయాయి. ఈమె ఆరోగ్యం మెరుగుపడి మంచి ఛాన్సెస్ రావాలని మనం కూడా కోరుకుందాం.