English | Telugu

అతనితోనే శ్రీముఖి పెళ్లట!

బుల్లితెర మీద ఎంతో మంది యాంకర్లు వారి వారి పంధాలో దూసుకెళుతున్నారు. కొంతమంది అందంతో, కొంతమంది పంచ్ డైలాగ్స్ తో ఆకట్టుకుంటున్నారు. ఇప్పుడు హీరోయిన్లకే కాదు యాంకర్లకు కూడా స్టార్ రేంజ్ ఉంది. అలా మిస్సైల్ లా దూసుకెళుతోంది హాట్, క్యూట్, స్మార్ట్ స్టార్ యాంకర్ శ్రీముఖి.

బుల్లితెరలో అన్ని షోస్ లో ఈమె కనిపిస్తోంది. మరో వైపు మూవీస్ లో ఛాన్సెస్ వస్తుంటే అందులో కూడా నటిస్తోంది. సోషల్ మీడియాలో పిచ్చ యాక్టివ్ గా కూడా ఉంటుంది ఈ అమ్మడు. అలాంటి శ్రీముఖికి సంబంధించిన విషయం ఒకటి నెట్టింట్లో ఫుల్ వైరల్ గా మారింది. మెగాస్టార్ చిరంజీవి నటించిన "భోళా శంకర్" లో శ్రీముఖి యాక్ట్ చేసింది. కెరీర్ విషయంలో ఫుల్ బిజీగా ఉన్న ఈమె పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది. అదేంటంటే స్టార్ యాంకర్ త్వరలో ఒక ఫేమస్ బిజినెస్ పర్సన్ ని పెళ్లి చేసుకోబోతోంది. కొంతకాలంగా అతనితో ఈ బుల్లితెర రాములమ్మ లవ్ లో ఉందట.

ఇక వీళ్ళ పెళ్ళికి టు ఫామిలీస్ వాళ్ళు కూర్చుని మాట్లాడుకుని పచ్చ జెండా కూడా ఊపారట. ఐతే ఈ పెళ్ళికి సంబంధించిన ఒక ఆఫీషియల్ ప్రకటన మాత్రమే రావాల్సి ఉందట. ఇది వరకు కూడా ఇలాంటి ఎన్నో రూమర్స్ శ్రీముఖి మీద వచ్చాయి. కానీ ఇప్పుడు మాత్రం ఈమె పెళ్లి వార్త చాలా గట్టిగానే వినిపిస్తోంది. మరి శ్రీముఖి తన పెళ్ళికి సంబంధించిన ఈ విషయాల మీద, తనకు కాబోయే వాడి మీద వస్తున్న వార్తలపై ఎలా రెస్పాండ్ అవుతుందో చూడాలి.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.