English | Telugu

హ‌గ్గుల‌తో, ముద్దుల‌తో రెచ్చిపోయిన రాకేశ్‌-సుజాత‌!

జబర్దస్త్ లో ఈమధ్య లవ్ ఎపిసోడ్స్ మస్తుగా బయటపడుతున్నాయి. ఈ షోలో ప్రేమలో పడిన వాళ్ళు దూసుకుపోతూ పెళ్లిళ్ల వరకు వెళ్తూ మిగతా షోస్ కి జంటలు జంటలుగా వెళ్తున్నారు. అలాంటి లవ్ స్టోరీ ఇప్పుడు రాకింగ్ రాకేష్, జోర్దార్ సుజాతది. వీళ్ళ ప్రేమ పీక్స్ కి వెళ్ళింది. ఇటీవల వరలక్ష్మి వ్రతం సందర్భంగా సుజాత వెళ్లి రాకేష్ ఇంట్లో పూజ కూడా చేసేసింది. పెళ్లి కాకుండా ఆ ఇంట్లో పూజలేంటి అన్నవాళ్లకు మా మనసులు ఎప్పుడో కలిశాయని చెప్పకనే చెప్పేసింది. ఇక ఇప్పుడు శ్రావణ మాసం సందర్భంగా 'శ్రావణ సందడి' పేరుతో ఈటీవీలో జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు ఒక కార్యక్రమాన్ని ఆదివారం రాత్రి 7 గంటలు ప్రసారం చేయబోతున్నారు. ఈ షోకి అనసూయ, రవి హోస్టింగ్ చేశారు.

అలాగే సినీ న‌టుడు నవీన్ చంద్ర కూడా ఈ షోలో పాల్గొన్నారు. ఇంకా ఈ షోలో ఎన్నో ఈవెంట్స్ కూడా నిర్వహించనున్నారు. ఐతే ఈ షోలో సుజాత, రాకేష్ తమ నిజమైన ప్రేమను చూపించేసి ముద్దులు పెట్టేసుకునేసరికి వీళ్ళ వ్యవహారం సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది. "షో కోసం షో చేసే జంట కాదు, మాది జీవితాంతం కలిసి ఉండే జంట" అంటూ రాకేష్ ఈ షోలో సుజాతకు ప్రపోజ్ చేస్తాడు. ఇలా అందరి ముందు తమ ప్రేమని బయటపెట్టేసి ముద్దులతో, హగ్గులతో రెచ్చిపోయారు. ప్రస్తుతం ఆ సీన్స్ తో కట్ చేసిన ప్రోమో యూట్యూబ్‌లో ట్రెండ్‌ అవుతోంది. జబర్దస్త్, బిగ్‌ బాస్‌, టీవీ ఆర్టిస్టులు, సింగర్లు ఈ షోలో పాల్గొన్నారు. ఇక ఈ ప్రోమోలో అమ్మాయిలకు, అబ్బాయిలకు మధ్య పోటీలు జరిగాయి.

ఎవరు గొప్ప అనే విషయంలో, ఒకరి మధ్య ఒకరికి పోటీ బాగా జరిగింది. అలాగే పంచ్‌లు, సెటైర్లు వేసుకుంటూ ఆద్యంతం నవ్వులు పూయించారు. అనసూయ గ్రీన్ కలర్ శారీలో శివగామిని గుర్తుచేసింది. ఇలా ఈ షో నెక్స్ట్ వీక్ అందరిని ఫుల్ ఎంటర్టైన్ చేయనుంది.

Karthika Deepam2: వైరాతో జ్యోత్స్న డీలింగ్.. కార్తీక్ కి డౌట్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -544 లో.....శౌర్యకి దీప భోజనం తినిపిస్తుంది. అది చూసి కొడుకు కోడలితో చెల్లి మాట్లాడుతలేనట్లు ఉందని అనసూయ అంటుంది. వాళ్లే దాక్కొని తిరుగుతున్నారని కాంచన అంటుంది. శౌర్య వెంట భోజనం తినమని దీప పరుగెడుతుంది. శౌర్య అలా అమ్మని పరిగెత్తించవచ్చా.. ఇప్పుడు అమ్మ కడుపులో బేబీ ఉంది కదా తనకి ఆయాసం వస్తుంది ఇకనుండి నువ్వే భోజనం చెయ్యాలని కాంచన అనగానే.. నువ్వు మంచి నానమ్మవి కాదు నిన్ను తాతయ్య దగ్గరికి పంపించాలి.. మా అమ్మ నాకు తినిపించకుండా చేస్తున్నావని శౌర్య అంటుంది.

Illu illalu pillalu: ఇంగ్లీష్ టీచర్ గా శ్రీవల్లి.. ప్రేమ, నర్మద ప్లాన్ సూపర్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu ). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -345 లో... భాగ్యం, ఆనందరావు ఇద్దరు రామరాజు ఇంటికి శ్రీవల్లి డూప్లికేట్ సర్టిఫికేట్లు తీసుకొని వస్తారు. అవి ప్రేమ చూసి డూప్లికేట్ సర్టిఫికేట్లు అని చెప్పదు. ఇంకేంటి మావయ్య మీరు మీకు తెలిసిన కాలేజీ ప్రిన్సిపల్ కి ఫోన్ చెయ్యండి.. అక్క  ఇంగ్లీష్ టీచర్ గా జాయిన్ చెయ్యండి అని ప్రేమ అంటుంది. రామరాజు ఫోన్ చేస్తుంటే కావాలనే శ్రీవల్లి తుమ్ముతుంది. ఇప్పుడే వద్దు మావయ్య అంటుంది. అయినా రామరాజు వినకుండా ఫోన్ చేసి ప్రిన్సిపల్ తో మాట్లాడతాడు.