English | Telugu
హే పిల్ల నాకు చోటూ బావ కావాలి!
Updated : Nov 1, 2023
సిరి హన్మంత్, శ్రీహాన్ ఇద్దరూ సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో వెలిగిపోతున్న స్టార్స్. అలాంటి సిరి ఇప్పుడు "ఆస్క్ మీ ఆ క్వశ్చన్" అని అనేసరికి చాలామంది చాలా అడిగేసారు. "నిన్ను లీడ్ రోల్ లో సిల్వర్ స్క్రీన్ మీద చూడాలని ఉంది" అని అడిగేసరికి " నేను కూడా ఆ విషయం గురించి చాలా ట్రై చేస్తున్నా..థ్యాంక్యూ సో మచ్...అవకాశం కోసం వెయిట్ చేద్దాం" అని ఆన్సర్ చేసింది. "నీది, శ్రీహాన్ కి వెబ్ సిరీస్ ఎప్పుడు రాబోతోంది" అని అడిగారు "త్వరలో రాబోతోంది" అని చెప్పింది సిరి. "నువ్వంటే నాకు చాలా ఇష్టం ఏం చేస్తాం మరి అన్నయ్య నిన్ను లవ్ చేస్తున్నారుగా సరేలే" అనేసరికి సిరి మాత్రం ఆశ్చర్యపోతున్నట్టుగా ఒక ఎమోజిని పోస్ట్ చేసింది.
"హే పిల్ల నాకు మా చోటూ బావ బాగా నచ్చాడు..ఇచ్చేస్తావా..నేనే లాక్కెళ్లిపోనా" అంటూ ప్రియాంక సింగ్ కొంటెగా అడిగింది. దానికి సిరి "పోవే" అని రిప్లై ఇచ్చింది. ఇక సిరి బిగ్ బాస్ హౌస్ లో ఉన్న టైంలో శ్రీహాన్ బయట ఉండి బాగానే సపోర్ట్ చేశాడు. అలా ఐదో సీజన్‌లో సిరి కోసం బిగ్ బాస్ స్టేజ్ మీదకు వచ్చిన శ్రీహాన్..ఆరో సీజన్‌లో కంటెస్టెంట్‌గా వచ్చాడు. ఇక బిగ్ బాస్ ఇంట్లో శ్రీహాన్‌కు కాస్త నెగెటివిటీ వచ్చింది. కానీ సిరి మాత్రం వాటిని బయట ఉండి కవర్ చేసింది. శ్రీహాన్ గెలిచేందుకు ఎంత చేయాలో అంత చేసింది. ఇక పెళ్లి గురించి ఎప్పుడు ఏం అడిగిన త్వరలో చేసుకుంటాం అని చెప్తూనే ఉంటుంది. నెటిజన్స్ కూడా త్వరగా పెళ్లి చేసుకోండి అంటూ సలహాలు ఇస్తూనే ఉన్నారు. మరి ఈ ఏడాది చేసుకుంటారో వచ్చే ఏడాది చేసుకుంటారో చేసుకునే డేట్ అనౌన్స్ చేయండి అని అడుగుతున్నారు ఫ్యాన్స్..