English | Telugu

పిల్లల్ని కనడం పెద్ద టాస్క్.. వెటకారంగా మాట్లాడకండి!

సింగర్ గీతామాధురి చాలా బాధపడుతోంది. ఆమె గురించి ఆమె పాటలే చెప్తాయి. ఆమె గొంతుకు ఎంతో మంది అభిమానులు కూడా ఉన్నారు. గీతా మాధురి కెరీర్‌ లోనూ బిజీగా ఉంది. అటు సినిమాల్లో పాటలు పాడుతునే... బుల్లితెరపై ప్రసారమవుతున్న షోస్ కి మెంటర్ గా కూడా వ్యవహారిస్తుంది. అలాంటి గీత రీసెంట్ గా ఒక వీడియోని తన ఇన్స్టాగ్రామ్ లో రిలీజ్ చేసింది. ఆ వీడియోలో తన ఆవేదన అంతా వెళ్లగక్కింది. నటుడు నందుని లవ్ మ్యారేజ్ చేసుకున్న గీతా మాధురికి ఒక కూతురు ఉంది. ఇంత హ్యాపీగా వీళ్ళ ఫామిలీలో గొడవలు జరుగుతున్నాయని...త్వరలో నందు, గీత విడిపోతున్నారంటూ కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి. వాళ్ళు కలిసి ఉన్నప్పటికీ ఈ రూమర్లకు ఫుల్ స్టాప్ మాత్రం పడడం లేదు.

నందు ఆల్రెడీ సోషల్ మీడియాలో తామిద్దరం బాగున్నామని చెప్పాడు. ఇక ఇప్పుడు గీతా మాధురి రిలీజ్ చేసిన ఒక వీడియో వైరల్ గా మారింది. పెళ్లి చేసుకుని ప్రశాంతంగా ఉన్న జంటలపై సొసైటీ కన్సర్న్ వలన చాలా స్ట్రెస్ పడుతోందని చెప్పుకొచ్చింది."అవును!! నిజం!! ప్రత్యేకంగా ఇప్పుడు ఉన్న తరంలో, జీవనశైలి, ఆహారనాణ్యత, పని సమయాలు, ఒత్తిడి, వాతావరణ మార్పులు, కాలుష్యంలో వస్తున్న మార్పుల కారణంగా బాడీలో కూడా చేంజెస్ వచ్చేస్తున్నాయి.

కాబట్టి పిల్లల్ని కనడం అనేది ఈరోజుల్లో పెద్ద టాస్క్ లా మారిపోయింది. నేను పెళ్ళై ఇంకా పిల్లలు పుట్టని ఐదు జంటలతో మాట్లాడాను. వాళ్లు చాలా స్ట్రెస్ లో ఉన్నారు. దానికి తోడు వాళ్ళ మీద సోసైటీ ప్రెజర్. సోసైటికీ అంత కన్సర్న్ ఉంటే.. వెటకారంగా మాట్లాడకండి.. యే మీకు పిల్లలు లేరా.. ఇంకా ఎప్పుడు కంటారు.. ఎప్పుడు డబ్బు సంపాదనేనా.. పిల్లలు కనండి, డాక్టర్స్ కి చూపించుకోండి..ఇలా అంటారు. ఇవన్నీ వాళ్లకు తెలీదా. ఈ ప్రశ్నల వలన జంటలపై ప్రెజర్ పడుతుంది. చుట్టాలు, సోసైటీ కపూల్స్ ను కంగారు పెడుతుంటారు. ఇలాంటి జంటలకు నేను చెప్పేది ఏంటంటే సోసైటీ ప్రెజర్ లో పడి.. మీరు ఒత్తిడికి లోను కాకండి. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. అందరూ అడిగే వాళ్లు జాగ్రత్తగా మాట్లాడండి. నాకు ఎందుకో చెప్పాలి అనిపించింది.." అంటూ తన మనసులో బాధను చెప్పకనే చెప్పింది గీతామాధురి.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.