English | Telugu

ప్రియాంక సింగ్ ఇష్టసఖుడు అతడేనా!

జబర్దస్త్ ద్వారా ఫేమ్ సంపాదించిన ప్రియాంక సింగ్ అలియాస్ సాయితేజ.. బిగ్ బాస్ -5 లో ఛాన్స్ కొట్టేసింది. జబర్దస్త్ కి ముందు నుంచే ఆమె ట్రాన్స్ జెండర్.. కాగా సొసైటీలో ట్రాన్స్ జెండర్ పై చిన్న చూపు అంటూ ఆమె చాలా సందర్భాలలో చెప్పుకొచ్చింది. అయితే తన ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేకుండా ప్రియాంక సింగ్ ఇండస్ట్రీకి వచ్చింది.

బిగ్ బాస్- 5 లో అవకాశం రావడంతో ఒక్కసారిగా సెలబ్రిటీ అయిపోయింది. అయితే తన బాడీని ఒక అమ్మాయిలాగా మేకోవర్ చేపించుకొని, హీరోయిన్ కి ఏమాత్రం తీసిపోని అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది ప్రియాంక సింగ్. మంచి ఫ్యామిలీ ఎమోషన్స్ తో బిగ్ బాస్ ప్రేక్షకులకు మరింత చేరువైన తను.. బిగ్ బాస్ లో తన హౌస్ మేట్ అయిన మానస్ తో సన్నిహితంగా ఉండేది. బిగ్ బాస్ నుండి బయటికొచ్చాక పలు టీవీ షోస్ లో మెరిసిన ప్రియాంక సింగ్.. చేసే ప్రతి పనిని వ్లాగ్ చేస్తూ తన ఇన్ స్టాగ్రామ్ లో, యూట్యూబ్ ఛానల్ లో పోస్ట్ చేస్తుంటుంది. అలా తను సమాజంలో ట్రాన్స్ జెండర్స్ మీద ఉన్న చులక‌న భావాన్ని కాదని.. ఒక్కతే బ్రతికి చూపిస్తూ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తోంది. చాలా మంది ఆమెని ఇన్స్పిరేషన్ గా తీసుకుంటున్నారు.

ప్రియాంక సింగ్ మొదట్లో సింప్లిసిటీకి కేరాఫ్ గా ఉండేది. ఆమధ్య బోల్డ్ ఫొటోస్ పెట్టి నెగెటివ్ కామెంట్స్ ని తెచ్చిపెట్టుకుంది. తాజాగా ప్రియాంక ఒక హాట్ డాన్స్ వీడియోని షేర్ చేసింది. "సమ్మోహనుడా" అంటూ హాట్ గా డాన్స్ చేసింది. అయితే ప్రియాంక పక్కన ఒక అతను డాన్స్ చేశాడు. అతని మొహం మాత్రం కనిపించకుండా చూసేవాళ్ళకి ఎవరతను అనే క్యూరియసిటి పెంచింది. బిగ్ బాస్ లో ఉన్నప్పుడు మానస్ ని తన క్రష్ గా చెప్పిన ప్రియాంక.. హౌస్ లో ఉన్నన్ని రోజులు తన వెంటే తిరిగేది. అయితే ఈ సమ్మోహనుడా పాటలో ప్రియాంకతో కలిసి డాన్స్ చేసింది మానస్ అని కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అయితే దీనికి ప్రియాంక ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి మరి.

Jayam serial : గంగ, రుద్ర పూజలో కూర్చుంటారా.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -164 లో..... రుద్ర ఏ విధంగా గంగకి హెల్ప్ చేసాడో అందరికి చెప్తాడు. పాపం పెద్దమ్మ హర్ట్ అయినట్లు ఉందని వంశీ అనగానే అయితే అవనివ్వులే గంగ సేఫ్ అయిందని పెద్దసారు అంటాడు. మరొకవైపు పారు ఫ్రెండ్స్ ని అకాడమీ మేడమ్ సస్పెండ్ చేస్తుంది. దాంతో నువ్వు సస్పెండ్ ఆపకపోతే నువ్వే ఇదంతా చేసావని మేడమ్ కి చెప్తానని పారు ఫ్రెండ్ పారుతో అంటుంది. దాంతో మేడమ్ ని సస్పెండ్ క్యాన్సిల్ చెయ్యమని రిక్వెస్ట్ చేస్తుంది పారు. తప్పు ఒప్పుకుంటున్నారు కదా ఈ ఒక్కసారి క్షమించండి అని మేడమ్ తో గంగ అనగానే తను సరే అని సస్పెన్షన్ క్యాన్సిల్ చేస్తుంది.

ఆ మీమ్ నన్ను చాలా డిస్టర్బ్ చేసింది...సావండి అంటున్న నైనికా అనసుర

నైనికా అనసురు బుల్లితెర మీద అందరికీ పరిచయమే. బిగ్ బాస్ సీజన్ 8 ద్వారా బాగా ఫేమస్ అయ్యింది. అలాగే ఢీ డాన్స్ షోలో డాన్స్ ద్వారా బాగా పాపులర్ అయ్యింది. ఇక ఇప్పుడు బిబి జోడి సీజన్ 2 లో అమరదీప్ కి జోడిగా చేస్తోంది. అలాంటి నైనికా రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో ఘాటుగా ఒక పోస్ట్ పెట్టింది. "ఎలాంటి పని లేకుండా జస్ట్ కూర్చుని అమ్మాయిల చిత్రాలను ఘోరంగా ఎడిట్ చేస్తూ వాళ్ళను హరాస్ చేసే ఒక స్టుపిడ్ మీమ్ పేజీలో పోస్ట్ చేసిన నా చిత్రాలు నన్ను చాలా డిస్టర్బ్ చేశాయి. మీకు పని లేదు బ్రో, మాకు మిమ్మల్ని పట్టించుకునేంత టైం లేదు. నువ్వు మా మీద పోస్ట్లు పెడుతున్నావ్ అంటే నువ్వు నీలోనే తోపు ఐనట్టే..మీ పేరెంట్స్ నిన్ను బాగా పెంచారు. మీలాంటి వాళ్ళే రేపు రేపిస్టుల్లా తయారవుతారు.