English | Telugu
అప్పుడప్పుడు అన్ని మూసుకుని కూడా చేయాలి
Updated : Jul 30, 2023
"నీతోనే డాన్స్" షో ఈవారం శనివారం ప్రసారమైన ఎపిసోడ్ దుమ్ము లేపింది. "టాలీవుడ్ మీట్స్ బాలీవుడ్" థీమ్ తో ఈ వారం డాన్స్ పెర్ఫార్మెన్సెస్ చేశారు. ఇందులో నటరాజ్ మాష్టర్- నీతూ రోబోటిక్ గెటప్ లో వచ్చి పెర్ఫార్మ్ చేసి చూపించారు. ఐతే రోబోటిక్ గెటప్ అంటే డాన్స్ స్టెప్స్ చాలా తక్కువగా చేయాల్సి వస్తుంది. ఐతే ఈ పెర్ఫార్మెన్స్ జడ్జెస్ కి పెద్దగా నచ్చలేదు. ప్రతీ వారం చాలా ఫ్రీగా డాన్స్ చేసే నటరాజ్ మాస్టర్-నీతూ డాన్స్ ఈ వారం తనకు పెద్దగా నచ్చలేదు అని చెప్పింది శ్రీముఖి. "ప్రతిసారి అన్నీ తెరుచుకుని చేస్తే బాగోదు..అప్పుడప్పుడు మూసుకుని కూడా చేయాలి..ఎప్పుడూ ఒకేలా కాకుండా కొత్తగా కనిపిస్తూ ప్రయోగాలు చేస్తూ ఉండాలి " అని కౌంటర్ వేశారు.
ఇక వీళ్ళ డాన్స్ పెర్ఫార్మెన్స్ మీద జడ్జెస్ కూడా కామెంట్స్ చేశారు. రోబో గెటప్ లో స్టెప్స్ వర్కౌట్ కాలేదని చెప్పారు. ఇక అంజలి-పవన్, నిఖిల్-కావ్య జోడీలు చెరో 6 మార్క్స్ ఇచ్చారు. వాళ్ళు మార్క్స్ ఇస్తుంటే నటరాజ్ మాస్టర్ కనీసం వాళ్ళ వైపు కూడా చూడలేదు. "వాళ్ళు చేసిన సాంగ్స్ లో మసాలా లేదనిపించింది. ఎనర్జీ డ్రాప్ ఐపోయింది. రోబో గెటప్ లో మాస్టర్ స్టెప్స్ చాలా తక్కువ చేసినట్టు ఉంది. కోరియోగ్రఫీ కాంప్లికేట్ అనిపించింది" అని చెప్పాయి మిగతా రెండు జంటలు. "వాళ్ళు కామెంట్స్ ఇస్తుంటే వాళ్ళ ముఖాల వైపు కూడా చూడడం లేదు అని నటరాజ్ మాస్టర్ ని.. అంజలి- పవన్ మీరు కూడా నా వైపు చూసి మార్క్స్ ఇచ్చారు" అని అంది శ్రీముఖి. "మాట్లాడేప్పుడు మన వైపు చూస్తే చెప్పాలని ఉంటుంది. కానీ మేము వాళ్లనే చూస్తూ మార్క్స్ ఇచ్చాము" అన్నారు అంజలి. "నేను ఆడియన్స్ కోసం చేస్తున్న.. డాన్స్ కి రెస్పెక్ట్ ఇస్తున్న" అన్నారు నటరాజ్ మాస్టర్. దానికి రాధ ,సదా మాట్లాడుతూ "డాన్స్ కి మాత్రమే కాదు డాన్సర్స్ కి కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి...మంచిగా పెర్ఫార్మ్ చేసినప్పుడు మంచిగానే మార్క్స్ ఇచ్చారు కదా. ఈ స్టేజి మీదకు వస్తే అన్ని విషయాలు మర్చిపోవాలి..ఏదైనా ఉంటే అటో ఇటో తేల్చేసుకోండి..మనసులో ఉంచుకోకండి " అని సలహా ఇచ్చారు. "ఆయనకు ఎవరితో ఐనా గొడవైనప్పుడు వాళ్ళ మొహం చూసి మాట్లాడరు" అని చెప్పింది నీతూ. ఇద్దరి మధ్య ఏం గొడవలో కానీ నటరాజ్-నీతూ, అంజలి-పవన్ జంటల మధ్య ప్రతీవారం ఏదో ఒక విషయంలో గొడవ జరుగుతూనే ఉంటుంది.