English | Telugu
మణికొండ ఇల్లంటే ఒక వైబ్...కానీ అమ్మక తప్పడం లేదంటూ కన్నీళ్లు పెట్టుకున్న జ్యోతక్క
Updated : Aug 3, 2023
శివజ్యోతి అలియాస్ జ్యోతక్క మణికొండలో తన ఇంటిని అమ్మేస్తున్నట్టు చెప్పి ఎమోషనల్ అయ్యింది. రీసెంట్ గా తన ఛానల్ లో అప్ లోడ్ చేసిన ఒక హోమ్ టూర్ వీడియోలో ఈ విషయాన్ని చెప్పింది శివజ్యోతి. మణికొండలో ఉన్న ఆ ఇంటి వలన తనకు ఎంతో లాభం కలిగిందని.. ఆ ఇంట్లో అడుగుపెట్టాకే కలిసొచ్చింది చెప్పింది. ఈ ఇంట్లోకి వచ్చాకే అవకాశాలు కూడా బాగా వచ్చాయంది. ఈ ఇల్లు చూపించినంత సక్సెస్, లవ్, గుర్తులు ఇంక ఏదీ ఇవ్వలేదు. ఐతే ఈ ఇంట్లో ఉన్నప్పుడే ఒక ఛానల్ ని స్టార్ట్ చేసింది జ్యోతక్క.. అది మూడు నెలలైనా పెద్దగా క్లిక్ అవ్వకపోయేసరికి డిప్రెషన్లోకి వెళ్లిపోయిందట. ఇంకా ఇతరత్రా కారణాల వలన ఆ ఇల్లు అమ్మేద్దామనుకుంటున్నట్లు చెప్పింది.
అమ్మేయగా వచ్చిన డబ్బుతో ఇంకా కొంచెం వేసి ఇంకో ఇల్లు చూసుకోవాలని చెప్పింది. ఈ ఇల్లు కొనే టైములో ఈవెంట్స్, యాంకరింగ్ చేస్తూ ఇల్లు కొన్నట్లు చెప్పింది. ఐతే ఈ ఇంట్లోకి వచ్చిన ఒక నెలకే లాక్ డౌన్ వచ్చిందని చెప్పింది. ఎన్ని సమస్యలు ఉన్నా తనకు ఈ ఇల్లు ఎంతో ఇష్టమని.. బాగా కలిసి వచ్చిందని అంది. ఈ ఇల్లు అమ్మకుండా ఉంచేస్తే వేరే చోట ఉన్న ఇంటికి ఈఎంఐలు, దీని ఈఎంఐలు కట్టలేక బర్డెన్ ఐపోతుంది కాబట్టి తప్పక ఇల్లు అమ్మేస్తున్నా అని చెప్తూ కన్నీళ్లు పెట్టుకుంది. తనకు బాగా కలిసొచ్చిన ఇంటిని అమ్మడం బాధగా ఉందంటూ ఏడ్చేసింది. లైఫ్ లో ఛాలెంజెస్ వస్తాయి ఫేస్ చేయాలి కాబట్టి సేల్ చేసేస్తున్నాను.. ఇలాంటి ఒక హోమ్ టూర్ చేసి ఇల్లు అమ్మేస్తున్నట్లు చెప్తానని అనుకోలేదంటూ చాలా ఫీలయ్యింది శివజ్యోతి . ఈ ఇంట్లోనే బుల్లితెర సెలబ్రిటీస్ ఛిల్ల్ అయ్యేవారని మణికొండలో ఈ ఇల్లంటే వాళ్లందరికీ ఒక పాజిటివ్ వైబ్ అని చెప్పింది. ఇకపోతే ఈ ఇంటిని కొనుక్కునేవాళ్లకు కూడా తనకు ఇచ్చినంత సక్సెస్ ఇవ్వాలని కోరుకుంటున్నా అని చెప్పింది శివజ్యోతి .