English | Telugu

Aata Sandeep:వన్ మిలియన్ వ్యూస్ దాటిన ఆట సందీప్, జ్యోతిరాజ్ డ్యాన్స్!

మూడు రోజుల క్రితం అయోధ్యలోని బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. దానికి యావత్ భారతదేశం నుండి సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, సినిమా ఇండస్ట్రీ ఇలా అన్ని రంగాల నుండి జనాలు వెళ్ళారు. అయితే కొంతమంది అయోధ్యవరకు వెళ్లకుండా ఇక్కడ ఉన్న గుడికి వెళ్ళి పూజలు చేశారు. అయితే బిగ్ బాస్ సీజన్ సెవెన్ కంటెస్టెంట్ ఆట సందీప్ మాత్రం త‌న డ్యాన్స్ తో రాముడిపై ఉన్న భక్తిని చాటుకున్నాడు.

ఆట సందీప్ తన కెరీర్ లో ఎన్నో పాటలకి కొరియోగ్రఫీ చేశాడు. ఆట షో టైటిల్ గెలవడంతో ఆట సందీప్ అతని భార్య జ్యోతిరాజ్ ఇద్దరు ఫేమస్ అయ్యారు. ఇక కొన్నిరోజులు వీరిద్దరి కొరియోగ్రఫీ లైఫ్ కి బ్రేక్ పడింది. ఆట సందీప్ బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో ఎంట్రీ తో తన సెకెండ్ లైఫ్ ని స్టార్ట్ చేశాడు. ఇందులో ఎక్కువగా స్పై బ్యాచ్ లోని అమర్, శోభాశెట్టి, ప్రియాంక, తేజలతో ఎక్కువగా ఉండేవాడు. ఆట సందీప్. ఆట సందీప్, అమర్ దీప్ తో కలిసి ఎన్నో గేమ్స్, టాస్క్ లలో ఫౌల్ చేశాడు. ఇక మొట్ట‌మొదటి హౌస్ మేట్ గా గెలిచి ఆరువారాల ఇమ్యూమిటీ పొంది నామినేషన్ లో లేడు. ఆ తర్వాత కెప్టెన్ గా గెలిచి మరో వారం నామినేషన్ లో మిస్ అయ్యాడు.‌ ఇక తొమ్మిదవ వారం టేస్టీ తేజ నామినేషన్ చేయడంతోనే ఎలిమినేషన్ అయి బయటకొచ్చాడు ఆట సందీప్.‌ తొమ్మిది వారాలు ఓ కంటెస్టెంట్ నామినేషన్ లో ఉండకుండా హౌస్ లో ఉండటం ప్రథమం అయితే బయటకు రావడం ఇదే తొలిసారి జరిగింది. ‌ఇక హౌస్ లో ఉన్నన్ని రోజులు ప్రియాంక జైన్, శోభాశెట్టి, అమర్ దీప్ లతో ఎక్కువ స్నేహంగా ఉన్న ఆటసందీప్.. ఆ తర్వాత ఎలిమినేషన్ అయి బయటకొచ్చాక‌ ఎవరు జెన్యున్ ప్లేయర్? ఎవరు గ్రూప్ గా ఆడుతున్నారో‌ తెలుసుకొని పల్లవి ప్రశాంత్ కి సపోర్ట్ చేశాడు. ఇక భోలే షావలి ఎలిమినేషన్ తర్వాత ఆటసందీప్, అతని భార్య జ్యోతిరాజ్ వాళ్ళింటికి వెళ్ళి మరీ కలిసారు. ఇక శుభశ్రీ, టేస్టీ తేజ కలిసి రీల్స్ తో‌ బిజీగా ఉంటున్నారు.

ఇక తాజాగా ఆట సందీప్ తన మూవీ 'షాట్ కట్ ' టీజర్ లాంఛ్ చేశాడు. ఈ లాంఛ్ ఈవెంట్ కి బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అందరిని పిలవగా శివాజీ, తేజ, పల్లవి ప్రశాంత్, గౌతమ్ కృష్ణ, అశ్వినిశ్రీ, భోలే షావలి అటెంట్ అయ్యారు. ఇక తాజాగా అయోధ్యలో జరిగిన బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠ రోజున ఆటసందీప్ అతని భార్య జ్యోతిరాజ్ కలిసి రాముడి పాటకి డ్యాన్స్ చేశారు. అది ఇన్ స్ట్రాగ్రామ్ లోని తన పేజీలో పోస్ట్ చేశారు. కాగా ఈ డ్యాన్స్ మూడు రోజుల్లోనే వన్ మిలియన్ వ్యూస్ ని దాటింది. ఈ విషయాన్ని ఆట సందీప్ ప్రత్యేకించి మెన్షన్ చేశాడు.‌ దాంతో ఈ పాటకి ఆట సందీప్ డ్యాన్స్ బాగుందంటూ నెటిజన్లు కామెంట్లు చేయగా.. ఫుల్ క్రేజ్ వచ్చేసింది.