English | Telugu
పల్లవి ప్రశాంత్ తో కలిసి వ్యవసాయం చేస్తున్న ప్రిన్స్ యావర్!
Updated : Jan 7, 2024
ప్రిన్స్ యావర్.. బిగ్ బాస్ సీజన్ సెవెన్ చూసినవాళ్ళంతా ఇప్పుడు ప్రతీ ఇంట్లో ఒక సోదరుడిలా అనుకుంటున్నారు. బిగ్ బాస్ హౌస్ లో జీరో పర్స్ంట్ నెగెటివ్ తో ఉన్న కంటెస్టెంట్ యావర్. చూడటానికి బాలీవుడ్ హీరో కట్ అవుట్ తో బిగ్ లోకి ఎంట్రీ ఇచ్చి వేలమంది ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్నాడని అనడంలో ఆశ్చర్యం లేదు. భాష రాకపోయిన మంచి మనసుతో తెలుగు ప్రేక్షకులకి చేరువయ్యాడు యావర్.
బిగ్ బాస్ లోకి వెళ్ళకముందే ప్రిన్స్ యావర్ అంటే ఎవరో కూడా తెలియదు. అలాంటిది బిగ్ బాస్ ద్వారా మంచి ఫేమ్ సంపాదించుకున్నాడు. హౌస్ లో శివాజి, ప్రశాంత్ , యావర్ లు కలిసి ఒక గ్రూప్ గా మొదలై మంచి ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చారు. శివాజీ ఎప్పటికప్పుడు యావర్ కి గైడెన్స్ ఇస్తూ టాప్-5 వరకు ఉండేలా చేసాడు. యావర్ కూడా ప్రతి దాంట్లో శివాజి సలహా తీసుకుంటు ముందుకు వెళ్ళాడు. ఫ్యామిలీ వీక్ లో భాగంగా యావర్ వాళ్ళ అన్నయ్య రాగా మోస్ట్ ఎమోషనల్ గా ఎపిసోడ్ సాగింది. అది కూడా యావర్ కి ప్లస్ అయిందని చెప్పొచ్చు. బిగ్ బాస్ నుండి బయటకు వచ్చాక స్పై బ్యాచ్ అయిన శివాజీ, ప్రశాంత్ యావర్ లు తరుచు కలుస్తూనే ఉన్నారు. వాటికి సంబంధించిన వీడియోస్ ఎప్పటికప్పుడు నెట్టింట షేర్ చేస్తూనే ఉన్నారు.
తాజాగా యావర్ పొలంలో వ్యవసాయం చేస్తున్నాడు. అసలు విషయానికొస్తే పల్లవి ప్రశాంత్ వాళ్ళ ఊరికి వెళ్ళి అతడిని కలిసిన యావర్.. ట్రాక్టర్ నడుపుతు పొలం దున్నుతూ కన్పించాడు. అంతే కాకుండా ఒడ్లు చెక్కడం లాంటి పనులు పొలంలో చేస్తున్నాడు. దానికి సంబంధించిన వీడియోని యావర్ తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేయగా దానికి విశేష స్పందన వస్తుంది. అదంతా చూస్తూ ఉంటే మెల్లి మెల్లిగా యావర్ కి ప్రశాంత్ వ్యవసాయం నేర్పించేలా ఉన్నాడని అది చూసిన ఫ్యాన్స్ అనుకుంటున్నారు. బిగ్ బాస్ తర్వాత కూడా స్పై బ్యాచ్ కలిసి ఉండటం చూసి సీజన్ సెవెన్ ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు.