English | Telugu

శ్రీలీలతో హీరోగా చేస్తా... ఫాలోయింగ్ మాములుగా ఉండదు


ఇండస్ట్రీలో బ్రహ్మాజీ గురించి చెప్తే చాలు "కం టు మై రూమ్" అనే డైలాగ్ గుర్తొచ్చేస్తుంది. అలాంటి బ్రహ్మాజీతో చిట్ చాట్ అంటే మాములుగా ఉండవుగా ఆన్సర్స్ మరి. "ఆయనకు ఆల్కహాల్ అంటే ఇష్టమట. అలాగే బిర్యానీ తింటానని చెప్పారు. శ్రీలీల పక్కనే హీరోగా సినిమాలు చేస్తానన్నారు. బ్రహ్మానందంగారి గురించి చెప్పాలంటే ఆయనొక లివింగ్ లెజెండ్. ఆయనకు ఉన్న ఫాలోయింగ్ మాములుగా ఉండదు. ఆయనతో కలిసి వీడియోస్ పోస్ట్ చేస్తే అవి మిలియన్స్ లో లైక్స్ వస్తాయని, మళ్ళీ అందరూ నార్త్ ఇండియన్స్ మాత్రమే లైక్ చేస్తారని చెప్పారు.

చిరు గారు ఆఫ్ స్క్రీన్ ఆన్ స్క్రీన్ కూడా మెగాస్టార్, పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడు దొరకడం మన అదృష్టం, బ్రహ్మానందం గారిని కలవడం, భోజనం చేసే అదృష్టం దొరకడం పూర్వజన్మ సుకృతం, రవితేజ ఫుల్ ఆఫ్ ఎనెర్జీతో రెడ్ బుల్ లా ఉంటారు, జూనియర్ ఎన్టీఆర్ సకలకలా కోవిదుడు ఆల్రౌండర్ . ఇక ఫేవరేట్ డైరెక్టర్స్ ఆర్జీవీ, కృష్ణవంశీ, త్రివిక్రమ్. సూపర్ స్టార్ కృష్ణ అంటే చాలా ఇష్టం. అల్లరి సీతారామరాజు మూవీ ఆల్ టైం ఫేవరేట్. ఇప్పటికీ యంగ్ గా కనిపించడానికి కారణం జీన్స్ అనుకుంటా అన్నారు బ్రహ్మాజీ.

Podharillu:పొదరిల్లు సీరియల్ లో సూపర్ ట్విస్ట్.. మహాలక్ష్మికి పెళ్ళి ఫిక్స్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -02 లో.....మహాలక్ష్మి ప్రాజెక్ట్ డిజైన్ రెడీ చేసి హాల్లోకి వస్తుంది. వాళ్ళ నాన్న ప్రతాప్ ఇంకా అన్నయ్య మహాలక్ష్మికి డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తారు. ఒకసారి చూడు మహా అని వాళ్ళ అన్నయ్య అంటాడు. నాకేం ఇప్పుడు పెళ్లి వద్దు అవసరం అయితే వదిన నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోండి అని మహా అంటుంది. ఇప్పుడు డిజైన్స్ చూపించడానికి వెళ్తున్నానని తెలిస్తే డాడీ వద్దని అంటాడనుకొని డాడీ కాలేజీలో సర్టిఫికెట్ ఉన్నాయి తెచ్చుకుంటానని చెప్తుంది.