English | Telugu
అతడిచ్చిన ప్రేమలేఖ నచ్చింది కానీ..!
Updated : Jun 8, 2021
'కార్తీకదీపం' వంటలక్క గురించి తెలియని బుల్లితెర ప్రేక్షకులు ఉండరు. వంటలక్క పాత్రలో నటి ప్రేమి విశ్వనాథ్ తన పాత్రకు పూర్తి న్యాయం చేస్తోంది. సోషల్ మీడియాలో ఈమెకి భారీ ఫాలోయింగ్ ఏర్పడింది. ఎప్పటికప్పుడు పలు ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ యాక్టివ్ గా ఉంటోంది ప్రేమి విశ్వనాథ్. రీసెంట్ గా ఈమె యాంకర్ సుమతో కలిసి ఓ లైవ్ షోలో పాల్గొంది. ఈ క్రమంలో నెటిజన్లు అడిగిన రకరకాల ప్రశ్నలకు సమాధానాలిచ్చింది.
సుమతో కలిసి ప్రేమి విశ్వనాథ్ పెట్టిన ముచ్చట్లు బాగా వైరల్ అయ్యాయి. కొన్ని పర్సనల్ విషయాలను కూడా షేర్ చేసుకుంది. ఇక ప్రేమి తన మాటల్లో చాలా సార్లు మలయాళం అనే టాపిక్ తీసుకురావడంతో.. సుమ మధ్యలో కలుగజేసుకొని "మనం ఇండియన్స్ అంతా ఒక్కటే" అంటూ కవర్ చేసింది. ఇదిలా ఉండగా.. ఓ నెటిజన్ ప్రేమి విశ్వనాథ్ ను "రంగుపై మీ అభిప్రాయం ఏంటి..?" అని ప్రశ్నించాడు.
దానికి ఆమె కలర్ ముఖ్యం కాదని.. మనిషి గుణమే ముఖ్యమని చెప్పింది. ఆ కలర్ తోనే.. డీ గ్లామర్ రోల్ తోనే తాను ఇంత ఫేమస్ అయ్యానని చెప్పుకొచ్చింది. ఇక మరో నెటిజన్ "మీ జీవితంలో ఏమైనా లవ్ స్టోరీస్ ఉన్నాయా..?" అని అడిగాడు. దానికి ప్రేమి విశ్వనాథ్.. తాను ఎవరికీ ప్రపోజ్ చేయలేదని.. కానీ తనకి ఒకట్రెండు ప్రపోజల్స్ వచ్చాయని చెప్పింది. ఓ వ్యక్తి లవ్ లెటర్ ఇచ్చి ప్రపోజ్ చేశాడని.. లెటర్ బాగుంది కానీ ఆయన నచ్చలేదని.. సో రిజెక్ట్ చేశానని చెప్పుకొచ్చింది.