English | Telugu

బిగ్ బాస్ షో.. సెలబ్రిటీలు దొరకడం లేదా?

తెలుగులో బిగ్ బాస్ షో ఇప్పటివరకు నాలుగు సీజన్లను పూర్తి చేసుకుంది. అన్ని సీజన్లకు మంచి రేటింగ్స్ వచ్చాయి. ఇప్పుడు సీజన్ 5ను మొదలుపెట్టబోతున్నారు. జూలై నుండి ఈ షో ప్రారంభించాలని బిగ్ బాస్ నిర్వాహకులు భావిస్తున్నారు. దానికి సంబంధించిన పనులను కూడా మొదలుపెట్టారు. అయితే ఇప్పుడు వారికో సమస్య మొదలైంది. అదేంటంటే.. బిగ్ బాస్ షోలో కనిపించడానికి సెలబ్రిటీలెవరూ కూడా ఆసక్తి చూపడంలేదట.

సీజన్ 4లో పేరున్న తారలెవరూ కనిపించలేదనే విమర్శలు వచ్చాయి. అందుకే ఈసారి కాస్త క్రేజ్ ఉన్న వాళ్లను తీసుకురావాలని భావించారు. ఆ విధంగానే 30 మంది సెలబ్రిటీల లిస్ట్ ను సిద్ధం చేశారు. వారిలో 16 మందిని ఫైనల్ చేయాలనుకున్నారు. ఇంటర్వ్యూలు కూడా మొదలుపెట్టారు. అయితే వీరిలో చాలా మంది ఈ ఆఫర్‌ను రిజెక్ట్ చేస్తున్నారట. ఈ షో విషయంలో ఉత్సాహం చూపకపోవడానికి చాలా కారణాలున్నాయి. ఈ షో కోసం తప్పనిసరిగా రెండు వారాలు క్వారెంటైన్‌లో ఉండాలి.

దాంతో పాటు మరో వంద రోజులు షో కోసం వెచ్చించాలి. అంటే దాదాపు నాలుగు నెలల వరకు పర్సనల్ లైఫ్‌కి దూరంగా ఉండాలి. షోలో ఉన్నప్పుడు కరోనా వస్తే ఇంకో తలనొప్పి. అందుకే సెలబ్రిటీలు ఎవరూ కూడా ఈ షోపై పెద్దగా ఆసక్తి చూపడం లేదంటున్నారు. అంతేకాదు.. టైటిల్ గెలిచినప్పటికీ సినిమా అవకాశాలు వస్తాయనే కన్ఫర్మేషన్ లేదు. ఎందుకంటే గతంలో టైటిల్ గెలిచిన వారెవరికీ కూడా సరైన అవకాశాలు రాలేదు. అందుకే ఈ షో వైపు క్రేజ్ ఉన్న వారెవరూ చూడడం లేదు. అంటే ఈసారి కూడా అరకొర సెలబ్రిటీలతో అడ్జస్ట్ అవ్వాలన్నమాట!

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.