English | Telugu

విష్ణుప్రియ అసలు తగ్గట్లేదు! సెల్ఫీ వీడియోతో మ‌తులు పోగొడుతోంది!!

బుల్లితెరపై యాంకర్ గా విష్ణుప్రియ గుర్తింపు తెచ్చుకుంది. 'పోవే పోరా' షోతో ఆమె కెరీర్ మలుపు తిరిగింది. అప్పటివరకు యూట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్ తో ఆకట్టుకున్న ఆమె.. బుల్లితెరపై కనిపించి తన ఫాలోయింగ్ బాగా పెంచుకుంది. సోషల్ మీడియాలో ఆమె చేసే రచ్చ మాములుగా ఉండదు. శ్రీముఖితో కలిసి విష్ణుప్రియ చేసే అల్లరి వీడియోలు బాగా వైరల్ అవుతుంటాయి. మొన్నామధ్య ఇద్దరూ కలిసి గోవాకు వెళ్లారు. అక్కడ వీరిద్దరూ కలిసి తీసుకున్న ఫోటోలు ఇంటర్నెట్ లో చక్కర్లు కొట్టాయి.

కొంతకాలంగా వీరిద్దరూ కలిసి ఫిట్నెస్ మీద దృష్టి పెట్టారు. ఇద్దరూ కలిసి వర్కవుట్లు చేసేవారు. వ్యాయామాలకు వెళ్లేవారు. అలా తమ శరీర బరువు తగ్గించుకొని జీరో సైజ్ లోకి రావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. శ్రీముఖి సంగతేమో కానీ విష్ణుప్రియ మాత్రం శరీరాకృతి కోసం బాగానే కష్టపడుతోంది. ఈ క్రమంలో తన బాడీ షేప్ ను చూపిస్తూ ఇప్పటికే పలు ఫోటోలు, డాన్స్ వీడియోలు షేర్ చేసింది.

తాజాగా ఆమె వర్కవుట్లు చేసిన తరువాత ఎలా ఉందో చూసుకుంటూ సెల్ఫీ వీడియోను తీసుకుంది. అద్దం ముందు నిలబడి తన నడుము, నాభి అందాలను ప్రదర్శించింది. ఈ వీడియోను తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో పోస్ట్ చేసింది. ఈ మధ్యకాలంలో విష్ణుప్రియ ఫోటోలు, వీడియోలను చూస్తుంటే ఆమె అందాల ప్రదర్శనలో ఎలాంటి హద్దులు పెట్టుకోలేదనిపిస్తుంది. ఇవన్నీ కూడా సినిమాల అవకాశాల కోసమే చేస్తున్నట్లుంది. మరి ఆమెకి దర్శకనిర్మాతలు ఎవరైనా ఆఫర్లు ఇస్తారేమో చూడాలి!

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.