English | Telugu
Premi vishwanath: స్వర్ణగిరికి కార్తీక దీపం వంటలక్క.. సోషల్ మీడియాలో వైరల్!
Updated : Jun 20, 2024
కార్తీక దీపం సీరియల్ హీరోయిన్ వంటలక్క గురించి తెలియని వారంటూ ఎవరూ ఉండరు. వంటలక్క అసలు ప్రేమి విశ్వనాధ్. వంటలక్క ఏడిస్తే ఆడియన్స్ కూడా బాధపడుతూ ఉంటారు. అలాంటి వంటలక్క నటించిన కార్తీక దీపం సీరియల్ సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది.
బుల్లితెర మీద టాప్ రేటింగ్ లో దూసుకుపోయిన సీరియల్ "కార్తీక దీపం". ఈ సీరియల్ ప్రతీ ఇంట్లో ఒక ఫామిలీ మెంబర్ లా చక్రం తిప్పింది. ఆడియన్స్ వంటలక్కని సొంత మనిషిలా చూసుకునేవారు. ఆమె సీరియల్ లో ఏడిస్తే ఇక్కడ ఆడియన్స్ కూడా ఏడ్చేవారు. మోనితను సొంత శత్రువుల ఫీలయ్యి తిట్టేవాళ్ళు. డాక్టర్ బాబుని నిజమైన డాక్టర్ లా అనుకుని హారతులిచ్చారు. ఇక సెకెండ్ సీజన్ కార్తీకదీపం-2 లో కొత్త పాత్రలు.. పైగా వంటలక్కని నరసింహా అనే వ్యక్తి పెళ్ళి చేసుకోవడం వారిద్దరికి కలిగిన పాపే శౌర్య అనడంతో కథ గాడి తప్పిందా అని అనుకుంటున్నారంతా. మరోవైపు కార్తిక్ కోసం జ్యోత్స్న ప్రాకులాడటం ఇదంతా చూస్తుంటే కార్తీక్, దీప ఇద్దరు ఒక్కటి అవ్వడం కష్టమైన పనే. అయితే మేకర్స్ వీరిద్దరిని ఎలా కలుపుతారన్న క్యూరియాసిటి ఈ సీరియల్ చూస్తున్న జనాలందరిలోను ఉంది.
ప్రేమి విశ్వనాథ్ అలియాస్ వంటలక్క ప్రముఖ జ్యోతిష్కుడైన వినీత్ భట్‌ను పెళ్లి చేసుకుంది. మాస్కోలోని రష్యన్ పార్లమెంట్‌లో జ్యోతిష శాస్త్రంలో విశేష కృషి చేసినందుకు ఆయనకు "బెస్ట్ ఆస్ట్రాలజర్ ఆఫ్ ది వరల్డ్ 2017" అవార్డును కూడా గెలుచుకున్నారు. కేరళ ప్రజలు అతన్ని తిరుమేని అని కూడా పిలుస్తారు. ఇక వంటలక్కకు ఒక బాబు కూడా ఉన్నాడు. వంటలక్క అప్పుడప్పుడు గెస్ట్ రోల్స్ లో కూడా కనిపిస్తూ ఉంటుంది. 2019 లో వచ్చిన గోరింటాకు, 2020 లో వచ్చిన చెల్లెలి కాపురం (2020) వంటి తెలుగు సీరియల్స్‌లో కనిపించింది. అలాగే ఫేమస్ యాడ్స్ లో కూడా నటిస్తూ ఉంటుంది. దీపకి 310K ఫాలోవర్స్ ఉన్నారు. ఇప్పుడు తాజాగా యాదాద్రికి దగ్గరలో గల స్వర్ణగిరి టెంపుల్ ని సందర్శించింది దీప అలియాస్ ప్రేమీ విశ్వనాథ్. ఇక సంప్రదాయ వస్త్రాలతో గుడిలో కనిపించిన దీప.. వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ఆశీర్వాదం తీసుకుంది. ఇక ఇప్పుడు ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. మరి మీరు కూడా ఓసారి చూసేయ్యండి