English | Telugu

రాకింగ్ రాకేశ్ భర్త్ డే... చెప్పు చూపించిన సుజాత

ఇది కదా నయా ట్రెండ్.. ఇది కదా వైరల్ అంటే .. భార్య భర్తకి చెప్పు చూపించడమంటే మాములు విషయం కాదు కదా.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న జోర్దార్ సుజాత- రాకింగ్ రాకేశ్ ల న్యూస్ ఏంటి? అసలేంటి ఈ కథ ఓసారి చూసేద్దాం.

జోర్దార్ సుజాత - రాకింగ్ రాకేశ్ ఈ ఇద్దరి జోడి బుల్లితెర మీద సూపర్ హిట్ గా ఉంటుంది. జబర్దస్త్ లో ఐతే ఇక చెప్పక్కర్లేదు. ఒకరి మీద ఒకరు పంచులేసుకుంటూ ఉంటారు. వీళ్లది లవ్ మ్యారేజ్ అన్న విషయం తెలిసిందే. రాకేశ్ కెరీర్ కంటే కూడా సుజాత కెరీర్ ఫుల్ ఫార్మ్ లో ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే సుజాత ఆటిట్యూడ్, ఆమె భాష మొత్తం కూడా కామెడీకి కెరాఫ్ అడ్రెస్స్ గా ఉంటుంది. అందుకే ఎక్కువగా వెబ్ సిరీస్ లో ఈ మధ్య కనిపిస్తోంది. అలాగే షోస్ లో కనిపిస్తోంది ఇవన్నీ పక్కన పెడితే ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేస్తూ ఫుల్ ఎంటర్టైన్ చేస్తూ ఉంటుంది.

ఇక ఈ భార్యాభర్తలిద్దరు రెగ్యులర్ గా ఒకరికొకరు భర్త్ డే గిఫ్ట్, మ్యారేజ్ డే గిఫ్ట్.. ఇలా సందర్భానుసారంగా ప్రత్యేకమైన గిఫ్ట్ లు ఇచ్చుకుంటారు. అయితే తాజాగా రాకింగ్ రాకేశ్ పుట్టినరోజు సందర్భంగా తన భార్య సుజాత ఈ సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చింది‌. అది చూసిన రాకేశ్ షాక్ అయ్యాడు. ' మా వారి బర్త్ డే కి నా సర్ ప్రైజ్' అనే వ్లాగ్ ని సూపర్ సుజాత అనే యూట్యూబ్ చానెల్ లో అప్లోడ్ చేశారు. ఇందులో తన భర్తకి ఇచ్చిన గిఫ్ట్ చూసి అతనితో పాటు ఆ వీడియో చూస్తున్న నెటిజన్లు కూడా షాక్ అయ్యారు. ప్రపంచంలో ఎవరు ఎవరికి ఇవ్వని గిఫ్ట్ అదే అంటు రాకేశ్ ఆ గిఫ్ట్ చూపించాడు. తీరా గిఫ్ట్ ఓపెన్ చేసి చూస్తే చెప్పులు అవి. రాకింగ్ రాకేశ్ కి చెప్పు చూసి ఏం చెప్పాలో తెలియకపోయి కాసేపు మౌనంగా ఉన్నాడు. ఇక సుజాత అవి తీసుకోవడానికి గల కారణం చెప్తుంటే.. నెటిజన్లు ఫిధా అయ్యారు‌. అంతలా కనెక్ట్ అయిన ఈ వీడియోని మీరు చూసేయ్యండి.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.