English | Telugu
Suma Kanakala: సుమ యూఎస్ఏ వ్లాగ్.. అసలేం చేసిందంటే!
Updated : Jun 20, 2024
ఇక్కడైన విదేశాలలో అయిన మన ఇండియన్స్ సైకాలజీ ఒకటేనంటుంది యాంకర్ సుమ. యూఎస్ఏ వీసా కోసం ఎంతో మంది ప్రయత్నిస్తున్నారు. అయితే కొందరికే లభిస్తుంది. మరికొంత మంది యూఎస్ఏ కి వెళ్ళి కష్టాలు అనుభవిస్తున్నారు. ఇక ఇప్పుడేమో ఓ షూట్ వర్క్ మీద అమెరికా వెళ్ళిన సుమ అక్కడి జర్నీని నెటిజన్లకి షేర్ చేసింది.
బుల్లితెర స్టార్ మహిళ సుమ కనకాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన మాటలతో స్టార్ హీరోలని, డైరెక్టర్ లను సైతం మెప్పిస్తూ యాంకరింగ్ లో కొత్త ఒరవడిని సృష్టించింది. ఎంతమందిలో ఉన్నా.. ఏ స్టేజ్ మీద అయినా తన మాటలతో మెస్మరైజ్ చేస్తూ అనర్గళంగా మాట్లాడుతుంది సుమ. స్పాంటేనియస్ కామెడీ పంచ్ లతో ఎప్పుడు ఆకట్టుకునే సుమ.. సోషల్ మీడియాలో కూడా తన ప్రతిభని కనబరుస్తుంది. తన యూట్యూబ్ ఛానెల్ లోను వీడియోలు చేస్తూ బిజీగా ఉంటుంది సుమ. తన యూట్యూబ్ ఛానెల్ ని స్టార్ట్ చేసి అందులో కొన్ని టిప్స్ ఇస్తూ వీడియోలు కూడా చేస్తుంది. రీసెంట్ గా మహిళల కోసం ఒక వీడియోని చేసి మహిళలకి విలువైన టిప్స్ ని ఇచ్చింది సుమ. తనకు తోచినదే కాకుండా మహిళలకి ఎలా ఉండాలో కొన్ని కొత్త ఐడియాలని ఇస్తూ ఎంతోమందికి ఇన్స్పిరేషన్ గా నిలుస్తోంది.
అటు షూటింగ్స్ అంటూ బిజీగా ఉంటూనే, ఇటు ప్రమోషనల్ వీడియోలు చేస్తూ ట్రెండింగ్ లో ఉంటుంది సుమ. తాజాగా సుమ యూఎస్ఏ కి వెళ్ళింది. అక్కడ తన షూటింగ్ కి రెండు రోజులు గ్యాప్ దొరకడంతో అమెరికాలోని న్యూయార్క్, న్యూజెర్సీలోని కొన్ని ప్రదేశాలని తిరిగినట్టు ఓ వ్లాగ్ చేసింది . న్యూజెర్సీలోని అక్షర్ ధామ్ టెంపుల్, సాయిబాబా టెంపుల్ కు వెళ్ళిందంట సుమ. ఆ గుడి చాల నీట్ గా ఉందని, కట్టడానికి మెటీరియల్ అంతా ఇండియా నుండి తీసుకెళ్ళినవేనంట అంటూ సుమ చెప్పుకొచ్చింది. అయితే వీటితో పాటు షాపింగ్, ఛాయ్, టిఫిన్స్ కోసం వెళ్ళిన సుమ.. అక్కడ కూడా తన యాంకరింగ్ మాటలతో నవ్వులు పూయించింది. ' ఫన్ ఎట్ యూఎస్ఏ ' అనే వ్లాగ్ ని కొన్ని గంటల ముందు అప్లోడ్ చేయగా అది అత్యధిక వీక్షకాధరణ పొందింది. ఇక తన మాటలకి పంచులకి చాలా ఫ్యాన్ బేస్ కూడా ఉంది. ఇక తాజాగా తన స్టాఫ్ తో కలసి డ్యాన్స్ స్టెప్లులు వేసిన సుమ.. సోషల్ మీడియాలో వైరల్ గా నిలిచింది.