English | Telugu

అనుకు షాకిచ్చిన ఆర్య‌వ‌ర్ధ‌న్‌!

'బొమ్మ‌రిల్లు' శ్రీ‌రామ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తూ నిర్మిస్తున్న సీరియ‌ల్ 'ప్రేమ ఎంత మ‌ధురం'. గ‌త కొన్ని వారాలుగా జీ తెలుగులో ప్ర‌సారం అవుతున్న ఈ సీరియ‌ల్ క్ర‌మ క్ర‌మంగా టాప్ రేటింగ్‌ని ద‌క్కించుకుంటూ మ‌హిళా ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుంటోంది. ఈ శ‌నివారం 251వ ఎపిసోడ్ ప్ర‌సారం కాబోతోంది. రాత్రి 9 గంట‌ల‌కు ప్ర‌సారం అవుతున్న ఈ సీరియ‌ల్ పూర్వ జ‌న్మ‌లో మిస్స‌యిన త‌న ప్రేయ‌సి కోసం ఎదురుచూసే ఓ యువ‌కుడి క‌థ‌గా రూపొందించారు.

త‌న కంపెనీలో ఉద్యోగం మానేసిన అను నందిని టెక్స్‌టైల్స్‌లో ప‌నిచేస్తూ వుంటుంది. ఆ కంపె‌నీని కొనాల‌నే నిర్ణ‌యానికి వ‌స్తాడు ఆర్య‌వ‌ర్థ‌న్‌. ఈ విష‌యం తెలిసి జెండే వ‌ద్ద‌ని వారిస్తాడు. కార‌ణం చెప్ప‌మ‌ని ఆర్య అడుగుతుండ‌గా సీన్‌లోకి మీరా ఎంట్రీ ఇస్తుంది. "ఇంట్లో వుండాల్సింది పోయి ఆఫీస్‌కి ఎందుకొచ్చావ్ మీరా?" అంటాడు ఆర్య వ‌ర్థ‌న్‌. "వ‌ర్క్ లేకుండా వుండాలంటే ఏదోలా వుంది" అంటుంది మీరా.. క‌ట్ చేస్తే త‌ను కూడా నందిని టెక్స్‌టైల్స్ గురించి అడుగుతుంది. "ఒక‌ప్పుడు మ‌న కంపె‌నీతో పోటీప‌డిన నందిని టెక్స్‌టైల్స్‌ని మ‌నం కొన‌డం అంటే మ‌న గెలుపే క‌దా" అంటుంది. పైగా "పండ‌గ‌లు వ‌స్తున్నాయి. మ‌న‌కు స్టాఫ్ కావాలి. మిష‌న‌రీ కావాలి. ఆ కంపె‌నీని కొంటే రాజ‌నందిని శారీస్ ప్రొడ‌క్ట్‌ని పెంచుకోవ‌చ్చు"అంటుంది మీరా.

దీంతో జెండే సైలెంట్ అయిపోతాడు. ఆ వెంట‌నే నందిని టెక్స్‌టైల్స్ ఎండీ మ‌ధుక‌ర్‌ని పిలిపించి డీల్ సెట్ కావ‌డం.. కంప‌నీని ఆర్య టేకోవ‌ర్ చేయ‌డం చ‌క‌చ‌కా జ‌రిగిపోతాయి. నందిని టెక్స్‌టైల్స్ విజిట్‌కి వెళ‌తాడు ఆర్య‌.. ఆక్క‌డ త‌న‌ని ఎండీ చాంబ‌ర్‌లో చూసిన అను ఎలా రియాక్ట్ అయింది? ఆ త‌రువాత ఏం జ‌రిగింది? అన్న‌ది తెలియాలంటే ఈ రోజు రాత్రి 9 గంట‌ల‌కు జీ తెలుగులో ప్ర‌సారం అయ్యే 'ప్రేమ ఎంత మ‌ధురం' చూడాల్సిందే.

ట్రెండింగ్ లో కావ్య, సుధీర్ జోడి.. మల్టీ టాలెంటెడ్ మెజీషియన్ తో వివాహ యోగం

ఆట గ్రాండ్ లాంఛ్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఇక ఈ షోలో ఉన్న కావ్య మీద సుధీర్, సుధీర్ మీద నిహారిక ఫుల్ సెటైర్స్ వేసుకున్నారు. "మీ గురించి రికమెండ్ చేసి మరీ తీసుకొచ్చాను. ఎలాగున్నా నాకు మంచి పేరు తేవాలి" అన్నాడు. దాంతో కావ్య ఏమీ తెలీనట్టు నవ్వింది. ఆమెను చూసి జానీ మాష్టర్ నవ్వాడు. ఇక సుధీర్ ఆమె గురించి ఒక పెద్ద బయోడేటా లిస్ట్ రాసుకొచ్చాడు. "పేరు కావ్యశ్రీ, ముద్దుపేరు నడిచే తాజ్ మహల్, ఎగిరే ఎల్లోరా, కదిలే కాశ్మీర్" అన్నాడు. వెంటనే నిహారిక "అవన్నీ హనీమూన్ డెస్టినేషన్స్" అనేసరికి సుధీర్ షాకయ్యాడు. 

Brahmamudi : మినిస్టర్ కి ఎదురుతిరిగిన కావ్య.. రాజ్ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -943 లో..... కావ్య తన కూతురు మినిస్టర్ దగ్గర ఉందని తెలిసి వెంటనే అక్కడికి వెళ్లి మినిస్టర్ తో గొడవపడుతుంది. నా బిడ్డని నాకెందుకు దూరం చేశారని కావ్య అడుగుతుంది. ఓహ్ నిజం తెలిసిపోయిందా నా బిడ్డ అనారోగ్యంగా ఉందని నా భార్యకి తెలిస్తే తట్టుకోలేదు అందుకే బిడ్డని మార్చేసాను.. అయిన నీ బిడ్డ అనడానికి నీ దగ్గర ఏమైనా సాక్ష్యం ఉందా.. లేదు కదా.. నీ బిడ్డని నీకు ఇచ్చే ప్రసక్తే లేదని కావ్యతో మినిస్టర్ అంటాడు. నా బిడ్డని పదిహేను రోజుల్లో నా దగ్గరికి చేర్చుకుంటానని మినిస్టర్ కి కావ్య వార్నింగ్ ఇస్తుంది.