English | Telugu

అవినాష్ ముక్కుతో ఆడుకున్న అరియానా!

బిగ్‌బాస్ సీజ‌న్‌ 4తో 'జ‌బ‌ర్ద‌స్త్' క‌మెడియ‌న్ ముక్కు అవినాష్ కెరీర్ ఒక్క‌సారిగా మారిపోయింది. ఆ షోలో పాల్గొనే అవ‌కాశం లేక‌పోయినా స్టార్ మా చాన‌ల్‌ అవినాష్‌కి అండ‌గా నిలిచి ఏడాది పాటు స్టార్ మాలో ఎంట‌ర్‌టైన్ చేసేలా అగ్రిమెంట్ కుదుర్చుకుంది. ప్ర‌స్తుతం అవినాష్ స్టార్ మాలో 'కామెడీ స్టార్స్‌'తో పాటు 'డ్యాన్స్ ప్ల‌స్'`, '100 % ల‌వ్'` షో‌ల్లో త‌న‌దైన శైలి కామెడీతో ఆక‌ట్టుకుంటూ న‌వ్వులు కురిపిస్తున్నాడు.

అత‌నితో పాటు బిగ్‌బాస్ సీజ‌న్ 4 కంటెస్టెంట్ అరియానా గ్లోరీ కూడా కామెడీ చేస్తూ అల‌రిస్తోంది. వీరిద్ద‌రూ క‌లిసి '100 % ల‌వ్ పార్ట్‌2‌' షోలో న‌వ్వులు కురిపిస్తున్న ఓ ప్రోమో ప్ర‌స్తుతం నెట్టింట సంద‌డి చేస్తోంది. ప్ర‌తీ ఆదివారం రాత్రి 6 గంట‌ల‌కు ప్ర‌సారం అవుతున్న ఈ షోలో ఈ వారం అవినాష్ ముక్కుతో అరియానా ఓ ఆట ఆడేసుకుంది. ఈ షోలో అరియానా, అవినాష్ క‌లిసి 'ఓ ప్రేమ‌గాథ'‌` పేరుతో స్కిట్ చేశారు.

ఇందులో "ఇన్ని సంవ‌త్స‌రాలుగా నీ వెంట‌ప‌డుతున్నాను న‌న్ను ప్రేమించు గోపీ" అని అరియానా అడిగితే.. "నాకు ఇంట్లో ఎన్నో బ‌రువు బాధ్య‌త‌లున్నాయి రాధా" అంటాడు అవినాష్‌.. వెంట‌నే "నీ ముఖంలో ముక్కే బ‌రువు అనుకున్నాను.. నీకు బ‌రువు బాధ్య‌త‌లా?" అంటూ సెటైరేస్తుంది... వెంట‌నే అవినాష్‌.. "నేను నిన్ను ప్రేమించ‌ట్లేదు.. ప్రేమించ‌ట్లేదు".. అంటాడు.. అయితే "నువ్వు అబ‌ద్ధ‌మాడినా నీ ముక్కు మాత్రం నిజ‌మే చెబుతుంది గోపీ" అని అరియానా అన‌డంలో షోలో వున్న కంటెస్టెంట్‌లంతా ఘొల్లున న‌వ్వేశారు. అవినాష్ ముక్కు గోల ఏంటో తెలియాలంటే ఈ ఆదివారం రాత్రి 6 గంట‌ల‌కు స్టార్ మాలో ప్ర‌సారం అయ్యే '100 % ల‌వ్ పార్ట్‌2'` షో చూడాల్సిందే.