English | Telugu
హిమతో డ్రీమ్ సాంగ్ వేసుకున్న ప్రేమ్!
Updated : Jul 30, 2022
బుల్లితెరపై ప్రసారం అవుతున్న సీరియల్ `కార్తీక దీపం`. గత కొంత కాలంగా చిత్ర విచిత్రమైన మలుపులతో సాగుతున్న ఈ సీరియల్ ప్రస్తుతం కొంత పట్టుని కోల్పోయింది. వంటలక్క కారణంగా టాప్ 1 రేటింగ్ తో రికార్డు సృష్టించిన ఈ సీరియల్ మళ్లీ ఆ మార్కుని అందు కోవాలని ప్రయత్నాలు చేస్తోంది కానీ వర్కవుట్ కావడం లేదు. ఇక తాజా ఎపిసోడ్ వివరాల్లోకి వెళదాం. కళ్లు తిరిగి పడిపోవడంతో శౌర్యని నిరుపమ్ ఎత్తుకుని తీసుకెళుతూ వుంటాడు. మధ్యలో కళ్లు తెరిచి చూసిన శౌర్యని నిరుపమ్ చూసి ఏంటీ మెలకువ వచ్చిందా? అంటాడు.
ఆ తరువాత అంతా ఇంటికి వెళతారు. సోఫాపై శౌర్యని నిరుపమ్ పడుకోబెడతాడు. వెంటనే లేచి కూర్చున్న శౌర్య ఎదురుగా కూర్చున్న నిరుపమ్ ని చూస్తుంది. నిన్ను మోసి అలసిపోయాడని సౌందర్య అంటుంది. బాధ్యతగా కాకుండా తిడుతూ మోయడం ఎందుకు అంటూ చిరాగ్గా శౌర్య గదిలోకి వెళ్లిపోతుంది. కట్ చేస్తే.. హిమ చీర కట్టుకుని తల స్నానం చేసి కురులు ఆరబెట్టుకుంటూ వుంటుంది. అప్పుడే ప్రేమ్ ఎంట్రీ ఇస్తాడు. హిమని అలా చూసి తనని తాను మరిచిపోతాడు. వెంటనే డ్రీమ్ లోకి వెళ్లి సాంగ్ వేసుకుంటాడు.
కట్ చేస్తే డాక్టర్ గా జబర్దస్త్ ఫేమ్ రైజింగ్ రాజు ఎంట్రీ.. శౌర్యకు జ్వరంగా వుందని పిలవడంతో వచ్చి రచ్చ రచ్చ చేస్తాడు. శౌర్యకు జ్వరం తగ్గిందంటాడు. అయితే హిమ మాత్రం అది వైరల్ ఫీవర్ అని వారం వరకు తగ్గదని చెబుతుంది. నాకన్నా నీకు ఎక్కువ తెలుసా? అంటూ రైజింగ్ రాజు హిమతో గొడవకు దిగుతాడు. నానా యాగీ చేసి అక్కడి నుంచి వెళ్లిపోతాడు.. తరువాత హిమ వెళ్లి శౌర్య టెంపరేచర్ చెక్ చేస్తానంటుంది. లేని ప్రేమని నటించడం ఎందుకు అంటూ శౌర్య అనడంతో ఫీలైన హిమ బయటికి వెళ్లి ఏడుస్తూ వుంటుంది. కట్ చేస్తే నిరుపమ్, హిమ మాట్లాడుకోవడం గమనించిన శౌర్య ఇంట్లోంచి వెళ్లిపోవాలని ప్రయత్నిస్తుంది. ఆ తరువాత ఏంజరిగింది? అన్నది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.