English | Telugu
మీ ఇద్దరి కాంబినేషన్ చాలా ఇరిటేషన్ అన్న ప్రదీప్
Updated : Sep 21, 2022
ఇప్పుడు మూవీ టైటిల్స్ ని కామెడీ షోస్ కి, ఈవెంట్స్ కి పేరడీ టైటిల్స్ లా పెట్టేసి ఆడియన్స్ అటెన్షన్ ని తమ వైపు తిప్పుకోవడానికి ట్రై చేస్తున్నాయి చానెల్స్ యాజమాన్యాలు. ఇప్పుడు రామారావు ఆన్ డ్యూటీ టైటిల్ ని పేరడీ టైటిల్ గా మార్చి "క్రేజీ ఫ్రెండ్స్ ఎంటర్టైన్మెంట్ ఆన్ డ్యూటీ" అనే ఎంట్రీ లైన్ తో లేడీస్ అండ్ జెంటిల్మెన్ అనే షో జీ తెలుగులో ఈ ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు ఆడియన్స్ ముందుకు రాబోతోంది. ఈ షోకి ఫ్రెండ్స్ ని పిలిచి ఎంటర్టైన్ చేసాడు ప్రదీప్. సింగర్ గీతామాధురి, హరితేజ స్టేజి మీదకు జంటగా వచ్చారు. "ఈ షో పేరు లేడీస్ అండ్ జెంటిల్మెన్ అని ఎందుకు పెట్టారో అర్ధం కావట్లేదు "అని హరితేజ అనేసరికి "మీరిద్దరూ లేడీస్ నేను జెంటిల్మెన్ " అని ప్రదీప్ కొంటె ఆన్సర్ ఇచ్చేసరికి గీత, హరి పగలబడి నవ్వేశారు.
తర్వాత భానుశ్రీ, అమిత్ స్టేజి మీదకు వచ్చారు. "అమిత్ మన ఫ్రెండ్ కదా" అన్నాడు ప్రదీప్ .."మన ఫ్రెండ్ ఏంటి" అంటూ భాను సీరియస్ గా అడిగేసరికి ప్రదీప్ వెంటను వాళ్లిద్దరూ చేసిన "ఏమున్నావే పిల్ల" సాంగ్ కి డాన్స్ చేసేసరికి ఇద్దరూ నవ్వేశారు. తర్వాత బెస్ట్ ఫ్రెండ్స్ వేణు వండర్స్, ధనాధన్ ధన్ రాజ్ స్టేజి మీదకు వచ్చారు. "మీ ఇద్దరి కాంబినేషన్, కో-ఆర్డినేషన్ గురించి మీరు డాన్స్ వేయగానే తెలిసిపోయింది" అన్నాడు ప్రదీప్..డాన్స్ వేస్తె ఇరిటేషన్ అనా" అంటూ ధన్ రాజ్ అనేసరికి అందరూ పగలబడి నవ్వేశారు. మరి ఈ ఫ్రెండ్స్ అందరూ కలిసి ఆడియన్స్ ని ఎలా ఎంటర్టైన్ చేశారు వీళ్ళ జర్నీ గురించిన విషయాలు తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.