English | Telugu
లేటు వయసులో ఘాటు రొమాన్స్.. షో మొత్తం చూడలేక చావాలి!
Updated : Sep 21, 2022
క్యాష్ షో ప్రతీ వారం కొత్తగా కలర్ ఫుల్ గా ముస్తాబై వస్తోంది. ఇక ఇప్పుడు ఈ షో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో లోబో, ఉమాదేవి, విశ్వ, సింధూర వచ్చారు. ఇక లోబో, ఉమాదేవి మీద యాంకర్ సుమ షో స్టార్టింగ్ లోనే సెటైర్లు వేసేసింది. బిగ్ బాస్ సీజన్ 5 లో లోబో, ఉమాదేవీ చేసిన రచ్చ అందరికీ తెలిసిందే. ఈ ఇద్దరి రొమాన్స్ చూసిన ఆడియన్స్ తలలు పట్టుకున్నారు. బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు లోబోని 'భంగు' అని పిలిచేది ఉమాదేవి. అదే పదం ఈ షోలో కూడా కంటిన్యూ చేసింది.
క్యాష్ స్టేజి మీదకి ఎంట్రీ ఇచ్చిన లోబో.. ఉమాదేవి ముఖాన్ని మొత్తం చేత్తో తడుముతూ "ఎలా ఉన్నావ్ పొట్టి?" అని అడిగాడు.. "ఎక్కడికెళ్ళిపోయావ్ ఇన్ని రోజులు" అంటూ ఉమాదేవి రొమాంటిక్ గా అడిగేసరికి "హలో మీ కళ్ళకు మేము కనిపించడం లేదుకదా.. ఏంటి అమెరికా నుంచి డైరెక్ట్ గా దిగినట్టున్నారు" అంటూ లోబో వేసుకున్న టీషర్ట్ చూసి కౌంటర్ వేసింది సుమ..
వెంటనే "ఏంటి భంగు అమెరికా వెళ్లిపోయావా" అని ఉమాదేవి అడిగేసరికి "ఓరి నాయనో ఈవిడకి భంగు, ఆయనకు పొట్టి.. మీ రొమాన్స్ చూడలేక చావాలి ఎపిసోడ్ అంతా" అని సుమపంచ్ డైలాగ్ వేసేసరికి అందరూ నవ్వేశారు. బిగ్ బాస్ నుంచి వచ్చాక ఉమాదేవికి సీరియల్స్ లో ఎలాంటి ఆఫర్స్ రావడం లేదు అలాగే 'కార్తీక దీపం' సీరియల్ లో కూడా కనిపించడం లేదు. ఏదేమైనా వీళ్ళ ఇద్దరి రొమాన్స్ మాత్రం ఫుల్ ఫేమస్ అయ్యింది.