English | Telugu
నా డెసిషన్ రాంగ్.. తుప్పాస్ రీజన్ వల్ల బయటకొచ్చా!
Updated : Oct 23, 2023
బిగ్ బాస్ సీజన్-7 ఆసక్తికరంగా సాగుతుంది. ప్రతీ కంటెస్టెంట్ తమ ఆటతీరు, మాటతీరుతో రోజు రోజుకి ఆసక్తి కలిగిస్తున్నారు.
బిగ్ బాస్ హౌజ్ లో ఇప్పటికి ఏడు వారాలు పూర్తయింది. అందులో గతవారం నయని పావని ఎలిమినేషన్ అవ్వగా, ఈ వారం పూజామూర్తి ఎలిమినేషన్ అయింది. అయితే ఎలిమినేషన్ తర్వాత బిబి బజ్ ఎగ్జిట్ ఇంటర్వ్యూలో గీతు రాయల్ తో హౌస్ మేట్స్ గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది పూజామూర్తి. మీకు రెండు నామినేషన్లు పడ్డాయి. వాటిలో మీకు ఏది తుప్పాస్ నామినేషన్ అనిపించిందని గీతు రాయల్ అడుగగా.. టేస్టీ తేజ వేసిన నామినేషన్ తుప్పాస్ అని పూజామూర్తి అంది. వైల్డ్ కార్డ్ గా ఎంట్రీ ఇచ్చిన మీరు వైల్డ్ గా ఆడుతారని అనుకున్నారంతా అని గీతు అడుగగా.. దెబ్బ తగులుతుంది ఆడపిల్లలు అంటే సైలెంట్ గా టీవీ చూస్తూ ఇంట్లో కూర్చోవాలని ఇక్కడికి రాకూడదని పూజామూర్తి అంది. ఇది భోలే షావలిని ఉద్దేశించి చెప్పిందని తెలుస్తుంది. మిగిలిన వాళ్ళు మీకన్నా డిజర్వింగ్ అనుకుంటున్నారా అని గీతు అడుగగా.. లేదు, బోలే షావలి, అశ్వినిశ్రీ నాకన్నా డిజర్వింగ్ కాదు. ఎందుకంటే టాస్క్ మొదలైనప్పుడు నన్ను టాప్ టూ బాటమ్ చూసి.. "హా నువ్వు ఫిజికల్లీ స్ట్రాంగ్ అని అన్నప్పుడు నాకే కాదు, ఎవ్వరికైనా కాలుద్ది" అని పూజామూర్తి అంది.
మీరు హౌస్ మేట్స్ తో కలిసి ఆడటానికి వచ్చారా లేక ఎంకరేజ్ చేయడానికి వచ్చారా అని గీతు అడుగగా.. గైడ్ చేశాను. అది కూడా ఒక గేమే అని పూజామూర్తి అంది. ప్లేయరే విన్ అవుతాడు కోచ్ విన్ అవ్వడని గీతు అంది. నా డెసిషన్ రాంగ్ కానీ నేను ఆడలేను అని ఆ నిర్ణయం తీసుకోలేదని పూజామూర్తి అనగా.. మీరు ఆడలేదు కదా అని గీతు అంది. ఇక్కడ హౌస్ లో ఉన్నవాళ్ళంతా ఆడి ఉంటున్నారనుకుంటున్నారా అని పూజామూర్తి అంది. ఇలాంటి బోలెడు ఆసక్తికరమైన విషయాలని పంచుకుంది పూజామూర్తి.