English | Telugu
పూజామూర్తి రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
Updated : Oct 23, 2023
బిగ్ బాస్ హౌస్ లో ఏడవ వారం పూజామూర్తి ఎలిమినేట్ అయింది. 2.0 లో గ్రాంఢ్ గా ఎంట్రీ ఇచ్చిన పూజామూర్తి హౌస్ లో తన ఆటతీరు, మాటతీరుతో ఆకట్టుకుంది. 2.0 లో అంబటి అర్జున్, నయని పావని, భోలే షావలి, పూజామూర్తి, అశ్వినిశ్రీ లు ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.
"గుండమ్మ గారి కథ" సీరియల్ లొ ప్రధాన పాత్ర పోషించిన పూజామూర్తి బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాక ఎవరితోను ఎక్కువగా కలవలేకపోయింది. అంబటి అర్జున్, గౌతమ్ కృష్ణ తో ఎక్కువ సమయం ఉండటంతో కాస్త పాజిటివిటీని పొందినా అశ్వినిశ్రీతో గొడవ పెద్ద మైనస్ గా మారింది. నోటికొచ్చినట్టు మాట్లాడటంతో తను హౌస్ లో రూడ్ బిహేవియర్ లా అనిపించింది. అయితే అన్నింటికన్నా ముఖ్యంగా నామినేషన్లో పల్లవి ప్రశాంత్ ని నామినేట్ చేసి చెప్పిన రీజన్ సరైనది కాదని అందరూ భావించారు.
కెప్టెన్ గా సరిగా బాధ్యతలు చేయలేదని, అందుకే హౌస్ లో అనర్హుడని పల్లవి ప్రశాంత్ ని నామినేట్ చేసింది పూజామూర్తి. దీనివల్ల ఆడియన్స్ లో నెగెటివిటి పెరిగింది. హౌస్ నుండి ఎలిమినేట్ అయి స్టేజ్ మీదకొచ్చాక ఎమోషనల్ అయింది పూజామూర్తి. హౌస్ మేట్స్ తో తనకున్న ఫీలింగ్ చెప్పుకొచ్చింది. హౌస్ లోని వారిలో ఉన్న బలం, బలహీనతల గురించి వారితో చెప్పింది పూజామూర్తి. అయితే హౌస్ లో పూజామూర్తి రోజుకి 35వేల చొప్పున వారానికి 2లక్షల 45 వేల వరకు రెమ్యునరేషన్ తీసుకుందంట. తను మొట్ట మొదటి వారంలోనే హౌస్ లోకి రావాల్సింది. అయితే వాళ్ళ నాన్న చనిపోవడంతో 2.0లో గ్రాంఢ్ ఎంట్రీ ఇచ్చింది పూజామూర్తి.