English | Telugu
నా కాంట్రాక్ట్ ముగిసింది.. నాకు మెసెజ్ లు చేయకండి!
Updated : Oct 24, 2023
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ లో ముకుంద వాళ్ళ అన్నయ్య ఎంట్రీతో కథ పూర్తిగా మలుపు తిరుగుతుంది. ఇస్తాడు. యాక్సిడెంట్ చేసి మురారిని హాస్పిటల్ కీ తీసుకొని వెళ్ళి ప్రాణాలు కాపాడతాడు ముకుంద వాళ్ళ అన్నయ్య. ఆ తర్వాత వేరొకరి శవాన్ని భవానీ వాళ్ల ఇంటికి పంపించి కృష్ణ చనిపోయాడని చెప్పిస్తాడు.
మరొకవైపు మురారి ఎక్కడున్నాడో తెలియక కృష్ణ విలవిల లాడిపోతుంది. అదే హాస్పిటల్ లో ముకుంద వాళ్ళ అన్నయ్య మురారికీ ట్రీట్ మెంట్ చేస్తున్న డాక్టర్ కాబిన్ దగ్గరికి వెళ్ళి.. నేను చెప్పినట్లు చెయ్యండంటు బ్లాక్ మెయిల్ చేస్తాడు. హాస్పిటల్ బయటకి వచ్చిన ముకుంద వాళ్ళ అన్నయ్య దగ్గరికి పోలీసులు వచ్చి అరెస్ట్ చేస్తారు. అతడిని అరెస్టు చేపించిన శ్రీనివాస్ ని చంపేస్తానని ముకుంద వాళ్ళ అన్నయ్య అంటాడు. డాక్టర్స్ మురారిని చూసి ఇతడిది చాలా క్లిష్టమైన కేస్, ఎవరికి చెప్పొద్దని డాక్టర్స్ మాట్లాడుకుంటారు. మరొక వైపు కృష్ణ, ప్రభాకర్ కలిసి భవానికి కంటపడకుండా వెనక్కి వచ్చేస్తారు.
మురారి క్యారెక్టర్ ముగిసిందని ఈ సీరియల్ అభిమానులు ప్రోమోల కింద కామెంట్లలో అడుగుతున్నారు. దీంతో పాటుగా గగన్(మురారి) ని ఇన్ స్టాగ్రామ్ లో అభిమానులు ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతున్నారంట. ఇక వాళ్ళ ప్రశ్నలన్నింటికి సమాధానమిచ్చాడు గగన్ అలియాస్ మురారి. " నాకు చాలా మెసెజ్ లు వస్తున్నాయి. నా కాంట్రాక్ట్ సరిగ్గా సంవత్సరం ఉంది. అది కూడా 1-10-222 నుండి 1-10-23 వరకని గగన్ అన్నాడు. దీని గురించి తప్పుడు ప్రచారం చేయకండి అని గగన్ అన్నాడు. నాకు ఈ సీరియల్ లో కాంట్రాక్ట్ ముగిసిందని రూమర్స్ స్ప్రెడ్ చేయకండని గగన్ అన్నాడు. దీంతో మురారి క్యారెక్టర్ ఈ కథలో ముగిసిందని స్పష్టంగా తెలిసింది. మరి మురారి స్థానంలో ఇంకెవరు వస్తారనే ఆసక్తి అందరిలో నెలకొంది.