English | Telugu
Pallavi Prashanth: పల్లవి ప్రశాంత్ కి భారీ బందోబస్త్.. ఇదే కదా రైతు విజయం!
Updated : Feb 4, 2024
ఇది కదా రైతు కథ.. ఇదే కదా రైతు కల.. సామాన్యుడిగా మొదలైన రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ ప్రయాణం.. ఎంతోమంది రైతులకి స్పూర్తినిచ్చింది. ఎక్కడో పొలంలో పనిచేసుకునే రైతు.. ఓ సెలెబ్రిటీ హోదాని దక్కించుకున్నాడు. ఓ ఇరవై మంది సెలబ్రిటీలున్న రియాలిటీ షోలో వారందరిని కాదని గెలుపుని సొంతం చేసుకున్న రైతుబిడ్డగా చరిత్ర సృష్ణించాడు పల్లవి ప్రశాంత్.
బిగ్ బాస్ సీజన్-7 మొదటి వారం నుండి చివరి వరకు ఆటల్లో మెరుపు వేగంతో దూసుకుపోతూ తగ్గేదేలే అన్న రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ కి విశేష ఆదరణ లభించింది. బిగ్ బాస్ సీజన్-5 కంటెస్టెంట్ అఖిల్ సార్థక్ నుండి అరియాన వరకు దాదాపు అందరు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ రైతుబిడ్డకి సపోర్ట్ చేశారు. దీనికి కారణం లేకపోలేదు. హౌస్ లోకి ఎంటర్ అయ్యాక ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు ప్రశాంత్. సీరియల్ బ్యాచ్ అతడిని తక్కువ చేసి చూశారు. అయితే హౌస్ లోని ప్రతీ ఆటలో వందకి వంద శాతం ఎఫర్ట్ పెట్టి తనేంటో నిరూపించుకున్నాడు ప్రశాంత్. చివరివరకు తగ్గేదేలా అంటు రెచ్చిపోయాడు. సెలెబ్రిటీలందరిని దాటేసి రైతుబిడ్డ సత్తా చాటుకున్నాడు. పల్లవి ప్రశాంత్ ని హౌస్ లోకి వెళ్ళనంతవరకు ఎంతోమంది ఎగతాళి చేశారు. వారందరికి తన గెలుపుతో సమాధానం చెప్పాడు.
పల్లవి ప్రశాంత్ ది సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం కొల్గూరు గ్రామం. తండ్రి సత్తయ్య రైతు. డిగ్రీ వరకు చదువుకున్న ప్రశాంత్ కి కల్చరల్ యాక్టివిటీస్ అంటే మక్కువ. స్నేహితులతో కలిసి ఓ యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేసి నెటిజన్లకి దగ్గరయ్యాడు. ఆ ఛానెల్ విషయంలో స్నేహితుల మధ్య వివాదం రావడంతో సూసైడ్ చేసుకోవాలనుకున్నాడు. కానీ వాళ్ళ నాన్న ఇచ్చిన ధైర్యంతో వ్యవసాయం చేయడం మొదలెట్టాడు. రైతులు పడుతున్న ఇబ్బందులు, సమస్యలను వీడియోలుగా తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో అవి కాస్త వైరల్ గా మారాయి. ' అన్నా మల్లొచ్చినా.. మల్లొచ్చిన అంటే తగ్గేదేలే' అనే ఆ వీడియో ఎంత వైరల్ అయిందో అందరికి తెలిసిందే. బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో ఎంట్రీ ఇచ్చి ఎంతోమందికి ఆదర్శంగా నిలిచి, నీతిగా నిజాయితీగా ఆడి రైతుబిడ్డ తల్చుకుంటే ఏదైనా సాధించగలడని నిరూపించాడు. చివరికి బిగ్ బాస్ సీజన్ సెవెన్ టైటిల్ గెలిచాడు.
తాజాగా సిద్దిపేట జిల్లా బెజ్జంకి గ్రామానికి పల్లవి ప్రశాంత్ వెళ్ళాడు. అక్కడ జనాలు అతడిని చూడటానికి పోటీపడ్డారు. దాంతో అక్కడి లోకల్ పోలీసులు పల్లవి ప్రశాంత్ కి సెక్యూరిటీగా వచ్చారు. బిగ్ బాస్ తర్వాత పోలీసులు అరెస్టు చేయగా.. ఇప్పుడు పోలీసులు సెక్యూరిటీగా రావడం నిజంగా గ్రేట్ అంటు పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కాగా ఇది ఇన్ స్ట్రాగ్రామ్ లో ఫుల్ ట్రెండింగ్ లో ఉంది.